ఉపాధ్యాయ సంఘాల నాయకులతో భేటీ అయిన ఎమ్మెల్యే
న్యూస్‌తెలుగు/ పెబ్బేరు : ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్న పలు సమస్యలపై పిఆర్‌టిఓ, టిఆర్‌టియు, పిఆర్‌టియుటిఎస్, మిగతా ఉపాధ్యాయ సంఘాల నాయకులు, విశ్రాంత ఉద్యోగుల సంఘము మండల అధ్యక్షులు Retd HM గుండ్రాతి ఎల్లన్న గౌడ్ నివాసంలో ఏర్పాటు చేసిన బేటీలో పాల్గొని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి దృష్టికి తెలిపారు. ఉపాధ్యాయుల పెండింగ్ బకాయిల చెల్లింపు ఉపాధ్యాయుల హెల్త్ స్కీమ్ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలతో పాటుగా స్కూల్ బ్యాగ్ లు అందచేయాలని పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణం మధ్యాహ్న భోజన పథకం కార్మికుల జీత,భత్యాల పెంపు తదితర ప్రధాన అంశాలను, సంఘాల నాయకులు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువచ్చారు. అందుకు సానుకులనగా స్పందించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ కచ్చితంగా పై సమస్యలు పరిష్కారం చేస్తామని, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఈశ్వర్ రెడ్డి, నరసింహ గౌడ్,దుర్గా ప్రసాద్, ఖాజా మైనద్దీన్, శివ శంకర్ యాదవ్,రాఘవేందర్ రెడ్డి దయానంద్,చిన్న రాముడు,బాషా, జి.రవి,రాజు తదితరులు పాల్గొన్నారు. (Story:ఉపాధ్యాయ సంఘాల నాయకులతో భేటీ అయిన ఎమ్మెల్యే)