గొర్రెలకు మేకలకు టీకాలు వేయించాలి
కలెక్టర్ ఆదర్శ సురభి
న్యూస్ తెలుగు/వనపర్తి : వనపర్తి జిల్లా కేంద్ర సమీపంలోని రాజనగరం గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఏర్పాటు చేసిన టీకాల శిబిరాన్ని కలెక్టర్ గారు సందర్శించారు. ఈ సందర్భంగా రాజనగరానికి చెందిన నక్క రాములు యాదవ్, బుడ్డయ్య యాదవ్, చింతకుంట సాయిల్ యాదవ్,ఆశన్న యాదవ్ మరియు యాదవ సోదరుల గొర్రెలకు వశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గొర్రెలకు టీకాలు వేశారు. గొర్రెలకు టీకాలు వేసే సమయంలో కలెక్టర్ గారు పర్యవేక్షించారు. అలాగే గొర్రెలకు టీకాలు వేసే ముందు గొర్రెల కాపరులకు సమాచారం ఇవ్వాలని కలెక్టర్ గారు అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో గొర్ల కాపర్ల సంఘం మాజీ చైర్మన్ పెండెం కురుమూర్తి యాదవ్, రాజనగరం యాదవ సంఘం అధ్యక్షులు కందూర్ గోపాల్ తో పాటు యాదవ సోదరులు తదితరులు పాల్గొన్నారు.(Storyv : గొర్రెలకు మేకలకు టీకాలు వేయించాలి )