భవిష్యత్తులో రాష్ట్రంలో,దేశంలో కెసిఆర్ కీలకపాత్ర పోషిస్తారు
న్యూస్ తెలుగు/వనపర్తి : అచ్చంపేట నియోజవర్గ బి.ఆర్.ఎస్ పార్టీ విస్తృత సమావేశంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కెసిఆర్ 25ఏండ్ల ప్రస్థానంలో ఎన్నో అవమానాలు,ఓడిదుడుకులు,రాజకీయ సంక్షోభాలు తట్టుకొని తెలంగాణ ప్రయోజనాలు కాపాడుతూ పార్టీని ఆకాశమంత ఎత్తులో నిలిపారని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు ఓడిదుడుకులు ఉంటాయని అంతమాత్రానికి భయపడిపోయి పార్టీని వీడితే వారూ రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నట్లే అని స్పష్టం చేశారు. పార్టీని కాపాడేది కార్యకర్తలు మాత్రమే నాయకులు కాదని కార్యకర్తల బలమే పార్టీకి శ్రీరామరక్ష అని ఆయన అన్నారు.అచ్చంపేట నాయకులు,కార్యకర్తలు స్ఫూర్తిని చాటినారని స్వచ్ఛందంగా సమావేశం పెట్టుకొని ఎవ్వరు వెళ్ళినా మాకు కెసి.ఆర్ నాయకత్వమే శిరోధార్యం అని చెప్పి నిలబడ్డారాని ప్రశంసించారు.త్వరలో మరిన్ని సమావేశాలు,శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేసి ఒక్కో మండలం ఒకరం ఇంచార్జ్ తీసుకొని స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ దుందుభి మోగిస్తామని అన్నారు.కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నమ్మి ప్రజలు మోసపోయారని రైతు భరోసా, రైతు రుణ మాఫీ,రైతుకూలీలకు రైతు భరోసా,అత్తకూడలకు 2500,పింఛన్లు 4000అంటే నమ్మి ఆశపడ్డారని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కొత్తవి ఇచ్చేవి దేవుడు ఎరుగు ఉన్న సంక్షేమ పథకాలు తొలగించారని,600రోజులలో రైతులు 600మంది ఆత్మహత్యలు చేసుకున్నారని విమర్శించారు.కృష్ణా, గోదావరి నది జలాలు సముద్రములో వృథాగా పోతుంటే నిలువరించలేని రేవంత్ సర్కార్ సన్నాసి సర్కార్ అని ఘాటుగా విమర్శించారు. యూరియా కొరత,కరెంట్ కోత,కొనుగోలు కోతలతో రేవంత్ కోతల పాలన చేస్తున్నారని దుయ్యబట్టారు. ఒక్క నాయకుడు పోతే వందలాది నాయకులను తయారు చేసే సత్తా కెసిఆర్ కి ఉందని,నాయకులు కార్యకర్తలు మనోధైర్యం కోల్పోకుండా పని చేయాలని అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.ఈ సమావేశములో మాజీ ఎమ్మెల్యే మర్రి.జనార్ధన్ రెడ్డి అధ్యక్షత వహించగా జిల్లా మాజీ ఎమ్మెల్యేలు, రాష్ట్ర నాయకులు,మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.(Story : భవిష్యత్తులో రాష్ట్రంలో,దేశంలో కెసిఆర్ కీలకపాత్ర పోషిస్తారు )
