స్థానిక ఎన్నికల కోసమే రైతు భరోసా
మెదక్ రైతు ధర్నాలో
మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
న్యూస్ తెలుగు/వనపర్తి : మెదక్ జిల్లాలో బి. ఆర్. ఎస్ ఆధ్వర్యములో జరిగిన రైతు ధర్నాలో మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ కె.సి.ఆర్ గారు రైతులకు,వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి వ్యవసాయ రంగాన్ని,ఆహార ఉత్పత్తులను దేశంలోనే అగ్రభాగాన నిలిపారని కొనియాడారు. కొవిడ్ సమయములో అన్ని రంగాలు మూతపడిన కె.సి.ఆర్ గారు దగ్గరవుండి రైతులకు సాగునీరు,24గంటల కరెంట్,యూరియా సరఫరా,రైతు బంధు సకాలములో ఇచ్చి కొనుగోలు పూర్తి చేసి లక్షలాది రైతులతో పాటు ప్రజలను కాపాడుకున్నారని అన్నారు.నేటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 600రోజులైనా పాలన గాలికి వదిలి రైతులను బజారున నిలబెట్టారని దుయ్యబట్టారు.రైతు భరోసాను కేవలం ఎన్నికల ఆయుధంగా కాంగ్రెస్ ఉపయోగించుకుంటుంది అని బోనస్ ఇస్తామని పోయిన వానకాలం,యాసంగికి బోనస్ ఎగ్గొటిందని అన్నారు.అన్ని రకాల వడ్లకు బోనస్ అని చెప్పి ఎన్నికల తర్వాత కేవలం సన్నాలకు మాత్రమే అని రైతులను మోసం చేసిందని ఆయన అన్నారు. ఎన్నికలకు ముందు 47వేల కోట్ల రుణమాఫీ చేస్తామని చెప్పి బడ్జెట్లో 31వేల కోట్లు పెట్టీ కేవలం 21వేల కోట్ల రుణమాఫీ చేసి చేతులు దులుపుకొన్నది అని కృష్ణా గోదావరి నది జలాలు ఆంధ్రా పాలవుతున్న,వృథాగా సముద్రం పాలవుతున్న నిర్లక్యం చేస్తూ రేవంత్ ఆంధ్ర పాలకుల ప్రయోజనాలు కాపాడుతున్నారని నిరంజన్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. యూరియా కొరత నివారించలేని ప్రభుత్వం రైతులకు ఏమి మేలు చేస్తుందని ఈ రాష్ట్రంలో సింగిల్ విండోల,మార్క ఫెడ్ ద్వారా ఇతర 9వేల సెల్స్ కౌంటర్లు ఉన్నాయని ఎక్కడ కూడా యూరియా లేక చెప్పులు క్యూ లైన్ లో పెట్టే దుస్తితి దాపురించిందని మంత్రి తుమ్మలకు రైతుల మీద ధ్యాసకూడా లేదని వాపోయారు. అదే కె.సి.ఆర్ హయాములో సీజన్ ప్రారంభం నాటికి కేంద్రంతో మాట్లాడి యూరియా అందేవిధంగా చర్యలు తీసుకున్నామని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత బోనస్ పేరు చెప్పి రైతు భరోసా ఎగ్గొట్టడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. రేవంత్ పాలన ప్రజలకు మంచి చేయడం మాని ప్రతిపక్షాలపై కక్ష్యపూర్తంగా వ్యవహరిస్తుందని కేంద్రంలోని బి.జె.పి, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చీకటి స్నేహం చేస్తూ రాష్ట ప్రయోజనాలను గాలికి వదిలేసింది అని విమర్శించారు. ప్రజలు హామీలు ఇచ్చి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికలలో బుద్ధి చెబుతారని ఆయన అన్నారు.(Story : స్థానిక ఎన్నికల కోసమే రైతు భరోసా )