బియ్యం పంపిణీతోపాటు, ప్రజా సమస్యలు పరిష్కరించాలి
న్యూస్ తెలుగు/వనపర్తి : జిల్లాలో కొత్త రేషన్ కార్డులకు బియ్యం పంపిణీ తో పాటు పలు ప్రజా సమస్యలను పరిష్కరించాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు, ఎఐటియుసీ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీరామ్, సిపిఐ పట్టణ కార్యదర్శి రమేష్ డిమాండ్ చేశారు. గురువారం వనపర్తి సిపిఐ ఆఫీసులో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జూన్ జూలై ఆగస్టు మూడు నెలల సన్నబియ్యాన్ని జూన్ 30 వరకు పంపిణీ చేశారన్నారు. పంపిణీ అనంతరం జిల్లాలోని 325 రేషన్ షాప్ లో బియ్యం మిగిలిపోయాయి అన్నారు. ఇటీవల జిల్లా అంతట 7005 ఉత్తరేషన్ కార్డులను ప్రభుత్వం పంపిణీ చేసిందన్నారు. వారు బియ్యం కోసం ఎదురుచూస్తున్నారని షాపూర్ లో ఉన్న బియ్యం నిల్వలను కొత్త రేషన్ కార్డులకు పంపిణీ చేయాలన్నారు. మళ్లీ సెప్టెంబర్ లో బియ్యం పంపిణీ చేస్తామని చెబుతున్నారని అంతవరకు షాపుల్లో ఉన్న బియ్యం పురుగు పట్టి పోతాయన్నారు. ఖరీఫ్ సాగు మొదలైందని కేఎల్ఐ భీమా జూరాల కాల్వలకు నీళ్లు వదిలినా పూడిక వల్ల చివరి ఆయకట్టుకు నీరు అందటం లేదన్నారు. డిమార్ట్ 27 ప్యాకేజీ డిస్ట్రిబ్యూషన్ కాలువలకు, డి 28 కాల్వకు మీరు రావడం లేదన్నారు. పూడిక తొలగించి నీళ్లు ఇవ్వాలన్నారు. 35 శాతం మంది రైతులకు రుణమాఫీ కాలేదని వారికి బ్యాంకులు పంట రుణాలు ఇవ్వడం లేదని, రుణమాఫీ చేయాలన్నారు. ఆగస్టు నెల వచ్చిన రైతులకు బ్యాంకులు పంట రుణాలు ఇవ్వడం లేదని ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతు భరోసా నిధులు సైతం చాలామంది ఖాతాల్లో పడలేదన్నారు. ఎకరాకు 6000 పడాల్సి ఉండగా 1400 కూడా పడ్డాయి అన్నారు. ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని లేదంటే సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. జిల్లా కార్యవర్గ సభ్యులు కళావతమ్మ,పట్టణ కార్యదర్శి రమేష్,సహాయ కార్యదర్శి గోపాలకృష్ణ,జయమ్మ,రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పృథ్వి నాదం, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.(Story : బియ్యం పంపిణీతోపాటు, ప్రజా సమస్యలు పరిష్కరించాలి )