తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఉద్యమించిన మహనీయుడు ఫ్రొఫెసర్.జయశంకర్
న్యూస్‌తెలుగు/వనపర్తి : ఫ్రొఫెసర్.జయశంకర్ సార్ 94వ జయంతి సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన విగ్రహానికి పూలమాలు సమర్పించి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాటి విద్యార్థిగా ముల్కీ ఉద్యమములో , 1969 ఉద్యమములో ఉద్యమపంతులుగా తదనంతరం తెలంగాణ ఉద్యమ నిప్పురవ్వని ఆరిపోకుండా మూడు దశాబ్దాల పాటు రాష్ట అభిలాషను సజీవంగా ఉంచిన కర్మయోగి,నిస్వార్థ,నిరాడంబర,విశ్వమానవ తేజోమూర్తి
కె.సి.ఆర్ గారు ప్రారంభించిన మలిదశ తెలంగాణ ఉద్యమానికి దశాబ్దంపైగా సైదాంతికంగా ఊపిరులూదిన తెలంగాణ జ్ఞాన శిఖరం ఆచార్య జయశంకర్ సార్ అని కొనియాడారు. మాజీ మంత్రి వెంట గట్టు యాదవ్,వాకిటి శ్రీధర్, రమేష్ గౌడ్,పరంజ్యోతి, గులాం ఖాదర్, రఘువర్ధన్ రెడ్డి, జాత్రు నాయక్, మాధవ రెడ్డి,నాగన్న యాదవ్, ఉంగ్లం తిరుమల్,రహీం ఇమ్రాన్ డేగ మహేశ్వర్ రెడ్డి, నీల స్వామి, చిట్యాల రాము, జోహేబ్ హుస్సేన్, మురళి సాగర్, పెద్దముక్కుల రవి, ఏకే పాష, చిలుక సత్యం సాగర్, బాల్ రాజు, హరి బ్రదర్స్ , గాలిగల్ల క్రాంతి , ఖాదర్, ఎండి మహబూబ్, నాగరాజు, ముని కుమార్, మోహన్ చారి ,శివ గౌడ్, లక్ష్మణ్ గౌడ్, లోకాజి రావు, నరేష్, చందు నాయక్, తోట శీను, వెంకటయ్య, నరసింహ, చాణిక్య, ప్రసాద్, నవీన్, తదితరులు పాల్గొన్నారు. (Story:తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఉద్యమించిన మహనీయుడు ఫ్రొఫెసర్.జయశంకర్)

