ఇళ్ల బాధితులకు ఆర్థిక సహాయం అందించిన బొల్లా
న్యూస్ తెలుగు /వినుకొండ : వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు ధ్వంసం చేసిన ఇళ్ల బాధితులకు ఆర్థిక సాయం అందించిన కార్యక్రమంలో వైయస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ పిఎసి మెంబర్, వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొల్లా మాట్లాడుతూ. వినుకొండ పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో, బొల్లాపల్లి మండలం వెల్లటూరు గ్రామంలో నివాసం ఉంటున్న సుమారు పది కుటుంబాల వారి నివాస గృహాలను హై కోర్ట్ ఆర్డర్ పేరుతో టిడిపి నాయకులు, అధికారులు అన్యాయంగా కూల్చేసిన ఇళ్లు, వ్యాపార సముదాయాల కారణంగా జీవితాలు దెబ్బతిన్న నిరుపేద కుటుంబాలకు నిజమైన అండగా నిలిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాధితులకు ఆర్థిక సహాయం కింద రూ. 5 లక్షల అందించిన వైయస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ పిఎసి మెంబర్ వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు రాష్ట్రంలో తుక్లక్ పాలన నడుస్తుందని, పేద ప్రజలకు స్వేచ్ఛ లేకుండాపోయింది అని గత ప్రభుత్వంలో వినుకొండ పట్టణంలో మంజూరు అయిన 100 పడకల ఆసుపత్రిను నిర్మాణం చేపట్టకుండా కాలయాపన చేస్తున్నారని, అలానే ఎన్ఎస్పి స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ వ్యాపారులకు నాలుగు లక్షలకే ఇస్తామని నమ్మపలికి నేడు దాని ఊసే లేకుండా ఉన్నారని, ఇక్కడ చిప్ విప్ ఆంజనేయులు, వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులమీద పెట్టిస్తున్న అక్రమ కేసులమీద ఉన్న శ్రద్ధ వినుకొండ నియోజకవర్గ అభివృద్ధి పై దృష్టి పెట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, బొల్లాపల్లి మండల స్థాయి నాయకులు పాల్గొన్నారు. (Story:ఇళ్ల బాధితులకు ఆర్థిక సహాయం అందించిన బొల్లా)

