వివేకానంద బీఈడీ కాలేజీ పన్నులు
వెంటనే చెల్లించాలి
ప్రజా సంఘాలు డిమాండ్
న్యూస్‌తెలుగు/ వినుకొండ : వినుకొండ నియోజకవర్గం, విఠంరాజుపల్లి పంచాయితీలో 2007 నుండి బీఈడీ కాలేజీ మరికొన్ని విద్యాసంస్థలు నిర్వహిస్తూ ఉన్నారు. నాటి నుండి నేటి వరకు ఒక్క రూపాయి కూడా గ్రామ పంచాయతీకి చెల్లించ లేదు. చిన్న చిన్న షాపులకు, ఇళ్లకు ఆగ మేఘాలపై పన్నులు కట్టించుకునే యంత్రాంగం వీరి విషయంలో నేటి వరకు ఎందుకు పన్నులు చెల్లించకపోతే చర్యలు తీసుకోలేదు అని స్థానిక పంచాయతీ సెక్రెటరీ శ్రీనివాసరావు ని ప్రజా సంఘాలు వివరణ అడగగా, అనేకసార్లు మేము ప్రయత్నం చేశామని అయినా ఒక రూపాయి పన్నులు చెల్లించలేదని. సుమారు 50 లక్షల రూపాయలకు పైగా పంచాయితీకి చెల్లించాల్సి ఉందని పంచాయతీ సెక్రెటరీ తెలిపారు. గ్రామ అభివృద్ధికి ఇలాంటి విద్యాసంస్థలు పన్నులు చెల్లించకపోవడం వలన ఆటంకం ఏర్పడుతుంది కాబట్టి పై అధికారులు కలుగజేసుకొని పంచాయతీ పన్నులు వసూలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మంగళవారం విఠంరాజుపల్లి లో జరిగిన సమావేశంలో స్థానిక ప్రజల తోటి పిడియం రాష్ట్ర నాయకులు వై వెంకటేశ్వరరావు, ఎంఆర్పిఎస్ జిల్లా ఇన్చార్జి రెడ్డిపోయిన ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు. (Story:వివేకానంద బీఈడీ కాలేజీ పన్నులు వెంటనే చెల్లించాలి)
