గుర్రపు డెక్కను తొలగించాలి
బర్రి చిన్నప్పన్న
న్యూస్‌తెలుగు/ విజయనగరం : మడ్డువలస గొర్లి శ్రీరాములు నాయుడు రిజర్వాయర్లో వున్న గుర్రపుడెక్కను తొలగించాలని జిల్లా మత్స్యకార సహకార సంఘం అధ్యక్షులు బర్రి చిన్నప్పన్న అన్నారు. సోమవారం జిల్లా జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంగర మండలంలో మడ్డువలస గొర్లి శ్రీరాములు నాయుడు రిజర్వాయర్ వద్ద విపరీతముగా గుర్రపుడెక్క ఉందని, దానివలన స్థానిక మత్స్యకార కటుంబీకులు సుమారు 500 కుటుంబాలు వారు జీవనోపాధికోల్పోతున్నారన్నారు. వెంటనే ఇరిగేషన్ డిపార్టుమెంటుఅధికారులకు తెలియజేసి దానిని వెంటనే తొలగించే ఏర్పాట్లు చేయాలన్నారు. గతంలో ఈ గుర్రపు డెక్క వల్లమత్స్యకారులకు గతంలో అనేక ప్రమాదాలు గురి అయ్యారన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ మత్స్యకారులు తదితరులు పాల్గొన్నారు. (Story:గుర్రపు డెక్కను తొలగించాలి )

