రేషన్ షాపును తనిఖీ చేసిన తహసిల్దార్
న్యూస్తెలుగు/ వినుకొండ : రేషన్ కార్డు దారులు నుండి ఎటువంటి ఫిర్యాదు వచ్చిన చర్యలు ఉంటాయని తాసిల్దార్ సురేష్ నాయక్ అన్నారు. మంగళవారం నాడు స్థానిక రైల్వే స్టేషన్ రోడ్ లోని పదవ నెంబరు చౌక దుకాణాన్ని ఆయన తనిఖీ చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ. నిబంధనలకు అనుగుణంగా చౌక దుకాణాన్ని తెరుస్తూ ఆయా తేదీల వరకు వినియోగదారులకు రేషన్ సరఫరా చేయాలని డీలర్ కు సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్ మురళీధర్ రావు, ఆర్ఐ శ్రీహరి పాల్గొన్నారు. (Story:రేషన్ షాపును తనిఖీ చేసిన తహసిల్దార్)

