మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడండి
న్యూస్‌తెలుగు/ వినుకొండ : జడ్పీ హై స్కూల్ ఎన్ఎస్పి కాలనీ, వినుకొండ నందు హరితాంధ్ర ప్రదేశ్ లో భాగంగా అయిదు కోట్ల మొక్కలను నాటి వాటిని పరి రక్షించడమే ధ్యేయంగా మొక్కల పండుగను ప్రారంభించినట్లు పాఠశాల హెచ్ఎం. హెచ్. వీరప్పయ్య తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పర్యావరణానికి ప్రభుత్వ సలహాదారుడైన కొమెర అంకారావు విచ్చేసి పాఠశాల విద్యార్థులు కు పర్యావరణం గురించి మరియు మొక్కలు పెంచడం వలన కలిగే ప్రయోజనాల గురించి తెలిపారు. ఆయన పిల్లలను ఉద్దేశించి మాట్లాడుతూ. మొక్కలు, వాటి ఆకుల ద్వారా వ్యాధులు తగ్గించు కోవచ్చని తెలిపారు. కావున ప్రతిఒక్కరూ మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని ప్రతి ఇంట్లో ఒక తులసి చెట్టు, ప్రతి వీధిలో ఒక వేపచెట్టు,ప్రతి ఊరులో ఒక రావి చెట్టు ,వూరి బయట మర్రి చెట్టు ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కౌన్సిలర్ డాక్టర్ పీవీ.సురేష్ బాబు మాట్లాడుతూ. ప్రతి విద్యార్ధి కనీసం ఒక మొక్కను దత్తత తీసుకోవాలని అన్నారు. గంగినేని పౌండేషన్ అధ్యక్షుడు, త్రిపురపురం మేజర్ డీసీ చైర్మన్ గంగినేని రాఘవరావు మాట్లాడుతూ. ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ వస్తువులను వాడకుండా పర్యావరణానికి తోడ్పడాలని అన్నారు. వినుకొండ ఎంఈఓ జఫ్రుల్లా, ఉర్దూ హై స్కూల్ హెచ్. ఎం. విజయభాస్కర్, గర్ల్స్ హై స్కూల్ హెచ్ఎం శైలజ పాల్గొని పాఠశాల ఆవరణలో మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. (Story:మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడండి)

