రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికైన గురుకుల పాఠశాల విద్యార్థులు
న్యూస్తెలుగు/ వినుకొండ : ఉమ్మడి గుంటూరు జిల్లా బాల్ బ్యాట్మెంటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆగస్టు 03న సబ్ జూనియర్ మరియు జూనియర్ బాలుర మరియు బాలికల ఎంపికలు నిర్వహించారు. ఈ ఎంపికల్లో స్థానిక నరసరావుపేట రోడ్డులోని మహాత్మా జ్యోతిబాపూలే (బీసీ) గురుకుల పాఠశాల లోని విద్యార్థులు యు. గౌతమ్, బి. వెంకటేశ్వర్లు రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారని స్కూల్ ప్రిన్సిపాల్ డి. వెంకటేశ్వర ప్రసాద్ తెలిపారు. రాష్ట్రస్థాయిలో జరిగే పోటీలు ప్రకాశం జిల్లా, గుడ్లూరు మండలం, చేవూరు గ్రామం నందు ఆగస్టు 29న నిర్వహించడం జరుగుతుందన్నారు. గుంటూరు జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ సెక్రటరీ ఏ.శ్రీనివాసరావు, అధ్యక్షులు ఈ. శివశంకర్ ఈ ఎంపికలను నిర్వహించారన్నారు. పాఠశాల నందు విద్యార్థులు చదువులలోనూ మరియు క్రీడలలోనూ సత్తా చాటడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థులను ప్రిన్సిపాల్ డి. వెంకటేశ్వర ప్రసాద్, పిఈటి జోనో నాయక్, ఏటిపి ఎస్కే ఖాసీం మరియు ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు అభినందించారు. (Story:రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికైన గురుకుల పాఠశాల విద్యార్థులు)

