బీసీ బిల్లు సాధన కోసం 72 గంటల నిరాహార దీక్ష
న్యూస్ తెలుగు/వనపర్తి : హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట కవిత బిసి బిల్లు సాధన కోసం 72 గంటల నిరాహార దీక్షకు మద్దతుగా ఉమ్మడి మహబూబ్ నగర్ తెలంగాణ జాగృతి నాయకులు నిరాహార దీక్షలో పాల్గొని దీక్షకు మద్దతు ప్రకటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా తెలంగాణ జాగృతి కన్వీనర్ డాక్టర్ వెంకట మూర్తి తెలంగాణ జాగృతి నాయకులు గౌరీ శంకర్ ఏజి దేవ్ తెలంగాణ జాగృతి నారాయణపేట జిల్లా అధ్యక్షులు శ్రీధర్ మక్తల్ నియోజకవర్గ కన్వీనర్ సయ్యద్ కలాం పాషా జాగృతి నాయకులు ప్రభాకర్ నారాయణ వెంకటేశు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.(Story : బీసీ బిల్లు సాధన కోసం 72 గంటల నిరాహార దీక్ష )

