స్మార్ట్ మీటర్లు వ్యతిరేకించండి
న్యూస్ తెలుగు / వినుకొండ : స్థానిక సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం వినుకొండలో షాపుల వెంట తిరుగుతూ స్మార్ట్ మీటర్లు వ్యతిరేకించండి అంటూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన విద్యుత్ ఛార్జీలు రద్దు చేయాలని కొత్త మీటర్లు ఉపసంహరించుకోవాలని ప్రూ ఆఫ్చార్జీలు, ఇంధనం సర్దుబాటు చార్జీలు అంటూ ముద్దు ముద్దు పేర్లతో అర్థం కాని భాషలో ప్రజలపై విద్యుత్ భారాన్ని మోపుతూ కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు స్మార్ట్ మీటర్లు రద్దు చేస్తామని, విద్యుత్ భారాన్ని తగ్గిస్తామన, పాత విధానం అమలు చేస్తామన, ఎస్సీ ఎస్టీలకు ఉచిత కరెంటు ఇస్తామని హామీ ఇచ్చి ఇవాళ ఆదానీ కంపెనీలకు లాభాలు కట్టబెట్టి ప్రయత్నంలో ఉన్న శ్రద్ధ, ప్రజలపై లేదు అందుకని ఆగస్టు 5వ తేదీ దేశవ్యాప్తంగా అన్ని కరెంటు సబ్ స్టేషన్లో స్మార్ట్ మీటర్లు రద్దు చేసే వరకు వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తామని, సిపిఐ ఎంఎల్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలో నిర్వహిస్తున్నామన్నారు. ఈ ధర్నాలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని వీధుల వెంట ప్రచారం చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రజా వ్యతిరేక విధానాలు వ్యతిరేకిస్తూన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి షేక్ ఫిరోజ్, మునగపాటి ప్రసాద్, కామా వెంకటేశ్వర్లు, భాస్కర్, లింగాచారి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. (Story:స్మార్ట్ మీటర్లు వ్యతిరేకించండి)

