గ్రామ దేవతలు గ్రామాలకు రక్షణ కవచాలు
శ్రీ శ్రీశ్రీ పోచమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ వేడుకలలో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు
న్యూస్ తెలుగు/మెట్టుపల్లి(6వార్డు) : అత్యంత ప్రతిష్టాత్మకంగా పోచమ్మ అమ్మవారి నూతన ఆలయం మరియు విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ వేడుకలు మూడు రోజులుగా అత్యంత వైభవంగా జరిగాయి.గౌరవ మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు చివరి రోజు దీక్ష హోమం, ప్రతిష్ఠ హోమంలలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా గౌరవ నిరంజన్ రెడ్డి గారికి గ్రామస్థులు సాదరంగా ఆహ్వానం పలికి సన్మానించారు.గౌరవ నిరంజన్ రెడ్డిగారు మాట్లాడుతూ గ్రామదేవతలు గ్రామాలకు దుష్టశక్తుల నుండి వచ్చే అనర్థాలను తొలగించి గ్రామానికి రక్షణ కవచాలుగా నిలుస్తాయని గ్రామ దేవతల పండుగలు ప్రజలలో భక్తిప్రభత్తులు ఐకమత్యం పెంపొందిస్తాయి అని ఇంత ఘనంగా పోచమ్మ అమ్మవారి ఆలయాన్ని,ప్రతిష్టను నిర్వహించిన నిర్వాహకులను అభినందించారు.
ఈ కార్యక్రమంలో చిట్యాల.రాము సింగ్నమోని.గోపాల్,రంగం.ఆంజనేయులు,గోకం.బాలరాజు,గట్టన్న, బాలపీరు,నరసింహ,రంగం.రాములు,వాకిటి. బాల్ రామ్,వాకిటి.శాంతి తదితరులు పాల్గొన్నారు.(Story : గ్రామ దేవతలు గ్రామాలకు రక్షణ కవచాలు )