Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ పామాయిల్, ఉద్యానపంటలతో రెట్టింపు ఆదాయాలు

పామాయిల్, ఉద్యానపంటలతో రెట్టింపు ఆదాయాలు

0

పామాయిల్, ఉద్యానపంటలతో రెట్టింపు ఆదాయాలు

మెగా పామాయిల్ ప్లాంటేషన్ ప్రోగ్రాంలో 

న్యూస్ తెలుగు/వినుకొండ  : రాష్ట్రంలోని పామాయిల్, ఉద్యాన పంటలతో రెట్టింపు ఆదాయాలు వచ్చే అవకాశాలు ఉన్నాయ ని, వాటిని రైతులంతా సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ చీఫ్‌ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పిలుపునిచ్చారు. ప్రతి ఎకరాకు రూ. లక్ష నుంచి లక్షన్నర వరకు ఆదాయంతో మెరుగైన గిట్టుబాటు ధరలు ఇచ్చే పామాయిల్‌ సాగుని అందిపుచ్చుకోవాలని ఆయన కోరారు. ఈ పంటలో చిన్న రైతులకు రూ.57వేల సాయం అందుతుందని, 9‌0శాతం రాయితీతో డ్రిప్ ఇరిగేషన్‌ సామాగ్రి ఇస్తున్నారని, మొక్కలు ఉచితంగా అందిస్తున్నారని, ఎరువులు వేసేందుకు, గుంతలు తీసేందుకు కూడా ప్రభుత్వమే డబ్బులు ఇస్తోందన్నారు. వినుకొండ నియోజకవర్గం, ఈపూరు మండలం, ముప్పాళ్లలో మెగా పామాయిల్ ప్లాంటేషన్ ప్రోగ్రాం, రైతుల అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అధికారులు పామాయిల్ సాగు పద్ధతు లు, తెగుళ్ల నివారణ, మార్కెటింగ్ అవకాశాలపై అవగాహన కల్పించారు. అనంతరం జీవీ మాట్లా డుతూ పామాయిల్ తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి అందిస్తుందని తెలిపారు. వరిసాగుతో ఆదాయం త‌క్కువ ఉంటున్న నేపథ్యంలో రైతుల తలసరి ఆదాయం పెంచేందుకు పామాయిల్, ఉద్యానపంటల సాగు ఎంతో అవసరమన్నారు. ఏలూరు, పశ్చిమగోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో పామాయిల్ అత్యధికంగా సాగు అవుతోందన్న ఆయన పల్నాడు జిల్లా కూడా ఆ జాబి తాలో ముందు వరసలో నిలవాలని ఆకాంక్షించారు. దేశంలో అత్యధికంగా పామాయిల్ ఎగుమతి చేస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అన్న జీవీ… పల్నాడు ప్రాంతంలోనూ పామాయిల్ సాగుకు ఎంతో అనుకూలమైన నేలలు ఉన్నట్లు తెలిపారు ఈపూరు మండలం మొత్తం వాటిని ప్రోత్సహిస్తామ న్నారు. పామాయిల్ సాగుకు ముందుకు వచ్చిన రైతులు అందరికీ అభినందనలు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌ పునర్నిర్మాణం చంద్రబాబుతోనే

ఈ సందర్భంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ యాత్ర ఎంతో విజయవంతమైందన్న జీవీ ఆ ఒప్పందాల ద్వారా అమరావతి, విశాఖ సహా వివిధ ప్రాంతాల్లో పెద్దఎత్తున పరిశ్రమలు, వేలాదిమందికి ఉద్యోగాలు రానున్నట్లు తెలిపారు. జగన్ ప్రభుత్వంలో రాష్ట్ర ప్రతిష్ఠ, ప్రజల ఆదాయం, పరిశ్రమలు అన్ని కూల్చడం తప్ప ఇలా నిలబెట్టడం సాధ్యం కాలేదని ఎద్దేవా చేశారు . ఆంధ్రప్రదేశ్ బ్రాండ్‌ను తిరిగి బలంగా నిలబెట్టాలన్న సీఎం చంద్రబాబు ప్రయత్నాలకు దేశ విదేశాల నుంచి మద్దతు లభిస్తోందని, సింగపూర్‌ పర్యటన సానుకూల ఫలితాలే అందుకు నిద ర్శనమన్నారు. సులభతర వాణిజ్యంలో జగన్ రాష్ట్రాన్ని 19వ స్థానానికి పడేస్తే చంద్రబాబు 4వ స్థానానికి తీసుకుని వచ్చారని, ఆ కృషి, నమ్మకాన్ని గుర్తిస్తునే వివిధ కంపెనీలు తిరిగి ఏపీలో పెట్టుబడులు పెడుతున్నాయని తెలిపారు. ఏపీ బ్రాండ్ బిల్డింగ్‌కు ఇది ఆరంభం మాత్రమే అన్న జీవీ భవిష్యత్‌లో మరిన్ని పరిశ్రమలు, పెట్టుబడులతో ఆంధ్రప్రదేశ్ నంబర్‌-1గా ఎదుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు, వ్యవసాయ అధికారులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.(Story : పామాయిల్, ఉద్యానపంటలతో రెట్టింపు ఆదాయాలు )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version