కూటమి ప్రభుత్వం రైతులను దోపిడి చేస్తోంది: వైయస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ పిఎసి మెంబర్
వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు
న్యూస్ తెలుగు/వినుకొండ : పట్టణంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా నియోజకవర్గానికి చెందిన అన్ని అనుబంధ విభాగాల సభ్యులతో బొల్లా మాట్లాడారు. ఈ సందర్బంగా బొల్లా మాట్లాడుతూ. ఈ కూటమి ప్రభుత్వం మద్దతు ధరల విషయంలో పూర్తిగా విఫలమైంది. నేడు వ్యవసాయం అంటే రైతులు భయపడే పరిస్థితి వచ్చిందన్నారు. పంటలకు సరైన ధరలు లేక, రైతులు తీవ్ర నష్టాలు చవిచూస్తున్నారు” అని అన్నారు. ఇటీవల వెల్లటూరు గ్రామంలో జరిగిన ఘటనపై ఆవేదన వ్యక్తం చేస్తూ, “వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటు వేసారు అనే నెపంతో నిరుపేద కుటుంబాలకు చెందిన ఇళ్లను కూల్చివేయడం హేయమైన చర్య” అని అన్నారు. ఈ అంశంపై, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. జగన్ మోహన్ రెడ్డి స్పందిస్తూ బాధితులకు ఆర్థిక సహాయం అందించబడిందని వెల్లడించారు. అలానే వారు మాట్లాడుతూ. కూటమి ప్రభుత్వం అన్నివిధాల విఫలమైందని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నియోజవర్గం మనం మన పార్టీ తరుపున పోటీ చేసి ఘన విజయం సాధించబోతున్నామని అన్నారు. వినుకొండ పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం వద్ద ఉన్న గాంధీ విగ్రహాన్ని రాత్రికి రాత్రే మాయంచేశారని, పట్టణంలో అనేక మంది విగ్రహాలు ఉన్న వాటిని కదిలించకుండా గాంధీ విగ్రహాన్ని మాయం చేయటం జరిగిందని అన్నారు. వినుకొండ మున్సిపాలిటీలో దోపిడి అడ్డగోలుగా జరుగుతుందని 44 లక్షల గ్రాంట్ వస్తె ఆ డబ్బును నీళ్ళ ట్యాంకర్ల దొంగ లెక్కలతో డబ్బును బిల్లులుగా మార్చుకున్నారని వారు ఆరోపించారు. రానున్న రోజుల్లో అందరం సమష్టిగా కలసి పనిచేసి వినుకొండ నియోజకవర్గంలో మళ్ళీ వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరెయ్యాలని పిలుపునిచ్చారు.(Story : కూటమి ప్రభుత్వం రైతులను దోపిడి చేస్తోంది: వైయస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ పిఎసి మెంబర్ )