వినుకొండ మండలంలో పొలం పిలుస్తుంది
న్యూస్ తెలుగు / వినుకొండ : వినుకొండ నియోజకవర్గం, పెద్ద కంచర్ల గ్రామంలో జిల్లా వనరుల కేంద్రం అధికారి ఎం శివకుమారి రైతు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతులకు వరి యాజమాన్యం , విత్తన రకాలు, విత్తన శుద్ధి ఎరువుల యజమాన్యం, జీవన ఎరువుల వాడకం, చీడపీడల నివారణ గూర్చి సమగ్ర అవగాహన కల్పించారు. మండల వ్యవసాయ అధికారి జి.వరలక్ష్మి పొలం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా మంగళవారం రైతులు వరి పంటకు 15 ఆగస్టు 2025 లోపు పంటల బీమాకు ఇన్సూరెన్స్ ప్రీమియంను ఎకరాకు రూపాయలు 80 కామన్ సర్వీస్ సెంటర్ లో క్రాప్సోన్ సర్టిఫికెట్ , ఆధారకార్డు, పొలంపాసు పుస్తకం,తో ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించుట ద్వారా రైతుల పంటకు ప్రకృతి విపరీత్యం సంభవించినప్పుడు మరియుచీడపీడలు ఆశించి దిగుబడులు తగ్గినప్పుడు పంటలకు బీమా వర్తిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వనరుల కేంద్రం ఏ ఓ.అరుణ, వినుకొండ ఏ.ఈ.ఓ.ఆరిఫ్, వీఏయే యశ్వంత్, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది రైతు సోదరులు పాల్గొన్నారు. (Story:వినుకొండ మండలంలో పొలం పిలుస్తుంది)