సుపరిపాలన తొలి అడుగు ప్రచారంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ
న్యూస్ తెలుగు / వినుకొండ : వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మండలం జయంతి రామాపురం, మేళ్ల వాగు గ్రామలలో *’సుపరిపాలన తొలి అడుగు’ ఇంటింటి ప్రచారం కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు స్వయంగా పాల్గొని ప్రజలతో మమేకమయ్యారు. ప్రచారంలో భాగంగా జీవి ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వాటి అమలు తీరు గురించి వివరించారు. ముఖ్యంగా సుపరిపాలన లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలను ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. (Story:సుపరిపాలన తొలి అడుగు ప్రచారంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ)