Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌వైద్యమిత్రాల బదిలీల్లో శాలరీ పెంచి బదిలీలు చేపట్టాలి..

వైద్యమిత్రాల బదిలీల్లో శాలరీ పెంచి బదిలీలు చేపట్టాలి..

వైద్యమిత్రాల బదిలీల్లో శాలరీ పెంచి

బదిలీలు చేపట్టాలి..

 రాష్ట్ర అధ్యక్షుడు మాచర్ల బుజ్జి

న్యూస్ తెలుగు / వినుకొండ : డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, వైద్యమిత్రాల బదిలీలను చేపడతామని రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న రెండు వేల మంది వైద్య మిత్రాల డేటాను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ సీఈఓ ఆదేశాల మేరకు టీం లీడర్స్, మరియు ఆయా జిల్లాల కోఆర్డినేటర్ల నుండి తీసుకోవడం జరిగిందని మాచర్ల బుజ్జి ఒక ప్రకటనలో తెలిపారు. తీసుకునేటప్పుడు వైద్య మిత్రాలు ఇప్పుడు పనిచేస్తున్న హాస్పటల్ నుండి 20 కిలోమీటర్ల పరిధిలో ఉన్న హాస్పిటల్ కి బదిలీలు చేర్పడతామని డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ సీఈఓ ఆ జిల్లాల కోఆర్డినేటర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గతంలో ప్రైమరీ హెల్త్ సెంటర్ నందు వైద్య మిత్రాలు పనిచేయడం జరిగింది గత ప్రభుత్వం 2022లో ప్రైమరీ హెల్త్ సెంటర్ లో పనిచేస్తున్న వైద్య మిత్రులందరిని కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ కు మరియు నెట్వర్క్ హాస్పిటల్కు మార్చడం జరిగింది. దీనివల్ల కొంతమంది మిత్రలకు 40 కిలోమీటర్లు 60 కిలోమీటర్ల పరిధిలో పనిచేస్తున్నారు,మాకు ఎటువంటి టి ఏ డి ఏ లు లేవు మాకు ఇచ్చే వేతనం 13 వేల రూపాయలు రోజు వెళ్లి రావడానికి 100 రూపాయలు ఛార్జి అవుతున్నది దీనివల్ల మిగతా డబ్బులతో కుటుంబ జీవన సాగించటం చాలా కష్టంగా ఉన్నది రాష్ట్ర అధ్యక్షుడు మాచర్ల బుజ్జి ఆవేదన వ్యక్తం చేశారు మా శాలరీ సమాన పనికి సమాన వేతనం కేడర్ ఇచ్చి మాకు బదిలీలు చేపట్టాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పిన విధంగా 25 వేల లోపు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు అందరికీ సంక్షేమ పథకాలు వర్తింప చేస్తామని చెప్పి ఉన్నారు కానీ అమలు పరచడం లేదు జీతాల ఫైలు హెల్త్ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఫేసి లో ఉన్నది ఫైల్ లో ఎటువంటి కదలిక లేదు ట్రస్ట్ అధికారులు ఫైలు హెల్త్ ప్రిన్సిపల్ సెక్రెటరీ పంపించాము అని చెప్పి అన్నారు ఇంతవరకు ఫైల్ లో కదలిక లేదు ఇప్పుడు బదిలీలు చేపడతామని చెప్తున్నారు మా మా నివాస ప్రాంతాల నుండి బదిలీలు చేయమని ఆంధ్రప్రదేశ్ వైద్య మిత్ర దళిత గిరిజన కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమైక్య యూనియన్ తరపున అడుగుతున్నాము ఎందుకంటే మాకు ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు మా రెసిడెన్సి అడ్రస్ ను ఆధారంగా చేసుకుని ఉద్యోగాలు ఇవ్వటం జరిగినది ఇప్పుడు చాలా దూర ప్రాంతాలకు బదిలీ అయినాము 18 సంవత్సరాల సీనియర్టిని గుర్తించి డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు అధికారులు ఇప్పుడైనా మాకు దగ్గర ప్రాంతాల్లో బదిలీ చేసి జీతాల ఫైలు త్వరగా అయ్యే విధంగా ఒక అధికారి నియమించి మాకు న్యాయం చేయవలసిందిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని మరియు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ ని ఆంధ్రప్రదేశ్ దళిత గిరిజన వైద్య మిత్ర కాంట్రాక్టు మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు మాచర్ల బుజ్జి ప్రభుత్వాన్ని ఒక ప్రకటనలో కోరారు త్వరలో మా అందరికీ న్యాయం చేకూరుస్తారని అన్ని సంక్షేమ పథకాలు వర్తించే విధంగా జీవో ఇస్తారని వైద్య మిత్రుల జీతాలు పెంచి బదిలీలు చేపడతారని వారు ప్రభుత్వాన్ని కోరారు. (Story:వైద్యమిత్రాల బదిలీల్లో శాలరీ పెంచి బదిలీలు చేపట్టాలి..)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!