Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌ఆగష్టు 15న ప్రతిభా పురష్కారాలు

ఆగష్టు 15న ప్రతిభా పురష్కారాలు

ఆగష్టు 15న ప్రతిభా పురష్కారాలు

న్యూస్‌తెలుగు/ విజయనగరం : ఆగష్టు 15న విద్యార్థిని విద్యార్థులకు ప్రతిభా పురష్కారాలు అందజేయనున్నట్లు పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు వెత్సా సత్యన్నారాయణ మూర్తి తెలిపారు. శుక్రవారం సంఘం కార్యాలయంలో జరిగిన విలేఖర్లు సమావేశంలో సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ గత 30 సంవత్సరంలుగా ఆర్యవైశ్య సంఘం మరియు ఆర్యవైశ్య వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రతిభా పురష్కారాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 2024-25 సంవత్సరంలో 10 వ తరగతి ఇంటర్, డిగ్రీ పరీక్షలలో 85% శాతం మార్కులు సాధించిన ఆర్యవైశ్య విద్యార్థిని విద్యార్థులు సంఘం వద్ద లభించే దరఖాస్తు తో పాటు, మార్కులు జాబితా, ఆధార్ కార్దు నఖలు సంఘం లో అందజేయవలసిందిగా కోరారు. ప్రాజెక్ట్ చైర్మన్ బొడ్డు కృష్ణారావు మాట్లాడుతూ ఆగష్టు 15న ఉల్లి వీది వెల్ఫేర్ అసోసియేషన్ భవనంలో నిర్వహించబోయే సభలో విద్యార్థులకు వెండి మెడల్,సర్టిఫికెట్ అందజేస్తామని చెప్పారు. వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఏడుకొండలు మాట్లాడుతూ పీజీ,ఏంబిఏ,సి.ఏ,లా కోర్సులు పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్ తో సన్మానం చేయనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సంఘం కార్యదర్శి మాచర్ల చంద్రశేఖర్ గుప్త, కోశాధికారి విజ్జపు వెంకట శ్రీనివాసరావు, వళ్ళంపాటి ఉపేంద్ర, కాపుగంటి రవి, ఆరిశెట్టి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. (Story:ఆగష్టు 15న ప్రతిభా పురష్కారాలు)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!