రైతుల సమక్షంలోనే రీ సర్వే
మలిచర్లలో రీ సర్వే ప్రత్యేక అధికారి పర్యటన
న్యూస్‌తెలుగు/ విజయనగరం : రైతుల సమక్షంలోనే రీ సర్వే జరుగుతుందని, రానున్న కాలంలో గొడవలు రాకుండా ఉండేందుకే ప్రస్తుతం రీ సర్వే జరుగుతుందని రీ సర్వే జిల్లా ప్రత్యేక అధికారి ఆర్. గోవిందరావు అన్నారు. విజయనగరం మండల పరిధిలో మలిచర్ల గ్రామంలో ఆయన పర్యటన చేపట్టారు సచివాలయం వద్ద ఏర్పాటుచేసిన కార్యక్రమంలో రైతుల వద్ద నుండి రీ సర్వే జరిగిన విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు రీసర్వేపై సంతృప్తి వ్యక్తం చేయడంతో ఆయన అధికారులను అభినందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిటీష్ వారి కాలంలో జరిగిన సర్వే అనంతరం ప్రస్తుతం ప్రభుత్వం రీ సర్వే నిర్వహిస్తుందన్నారు. దీనివల్ల రానున్న కాలంలో ఎటువంటి సమస్యలు రాకుండా ఉంటాదన్నారు. రీ సర్వే జరిగేటప్పుడు అందుబాటులో భూమి హక్కుదారులంతా ఉండాలన్నారు. ప్రస్తుతం రీ సర్వే జరుగుతున్న సమయంలో ప్రతివారికి తెలియపరుస్తున్నామని అందుబాటులో లేనటువంటి వారికి వారి కుటుంబ సభ్యుల సమక్షంలో రీ సర్వే నిర్వహిస్తున్నామన్నారు. ఎక్కడ ఇటువంటి ఇబ్బందులు తలెత్తకుండా రెవిన్యూ అధికారులకు చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశామన్నారు.ఆగస్టు 15 నుండి రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంకా 9 గ్రామాలకు రీ సర్వే చేయాలన్నారు. గ్రామాల్లో భూమి వల్ల ఎటువంటి సమస్యలు ఉండకూడదు అన్నదే రీ సర్వే ఉద్దేశం అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్డీవో దాట్ల కీర్తి, డిప్యూటీ తాసిల్దార్ స్వర్ణ కుమార్, రమణమూర్తి, చౌదరి, అధికారులు తదితరులు పాల్గొన్నారు. (Story:రైతుల సమక్షంలోనే రీ సర్వే)

