ప్రజా సమస్యల పరిష్కారానికై రాజీలేని పోరాటాల సిద్ధంకండి
న్యూస్‌తెలుగు/ వనపర్తి : ప్రజా సమస్యల పరిష్కారానికి సిపిఐ ఆధ్వర్యంలో రాజీలేని పోరాటాలకు పార్టీ కార్యకర్తలు,ప్రజా సంఘాల నాయకులు, శ్రేయోభిలాషులు, ప్రజలు సిద్ధం కావాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కె. విజయరాములు పిలుపునిచ్చారు.ఆత్మకూరులో రెండు రోజుల పాటు జరుగుతున్న సిపిఐ మూడవ జిల్లా మహాసభలు విజయవంతంగా ముగిసిన నేపథ్యంలో ఆయన శుక్రవారం పట్టణంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు.ఆత్మకూరు పట్టణంలో రెండు రోజులపాటు సిపిఐ జిల్లా మూడవ మహాసభలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా సిపిఐ పలు తీర్మానాలను ప్రవేశపెట్టిందని అన్నారు. జిల్లాలో కొత్తగా ఏర్పడిన మండలాల్లో జూనియర్ కాలేజీలు ఏర్పాటు చేయాలని అదేవిధంగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మించాలని డిమాండ్ చేశారు.చిన్నంబాయి మండలంలో సున్నపురాయి పరిశ్రమ ఏర్పాటు చేయాలని ఉల్లిగడ్డను నిల్వ ఉంచుకునేందుకు కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయాలన్నారు విద్యార్థులకు ఫీజు రియంబర్స్ మెంట్ చెల్లించాలని, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని జిల్లాలో వలసలు నివారించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో పోడు భూములు సాగు చేసుకుంటున్నా వారికి పట్టాలు ఇవ్వాలన్నారు పేదలకు ఇండ్ల స్థలాలు కేటాయించి ఇండ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సాగు భూములకు పట్టాలి వాళ్ళని రోడ్లు మరమ్మతులు చేపట్టాలని కోరారు భూదాన్ భూములలో నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించి ఇండ్లు నిర్మించాలని డిమాండ్ చేశారు. భూ భారతి రెవెన్యూ సదస్సుకు వచ్చిన రైతుల ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని తీర్మానాలు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. జిల్లా సమగ్ర అభివృద్ధి కై సిపిఐ ఆధ్వర్యంలో పోరుబాట పడుతున్నట్లు ప్రకటించారు.ఈ కార్యక్రమంలో జిల్లా నూతన కౌన్సిల్ సభ్యులు పి శ్రీహరి సీఎం శెట్టి అబ్రహం భాస్కర్ కుతుబ్ పాల్గొన్నారు. (Story:ప్రజా సమస్యల పరిష్కారానికై రాజీలేని పోరాటాల సిద్ధంకండి)

