హీడమా కంచుకోటలో బెయలి వంతెన నిర్మాణం
ఆనందంలో గ్రామస్తులు

న్యూస్ తెలుగు/ చింతూరు : దేశంలోనూ, చత్తీస్గడ్ రాష్ట్రంలోనూ హిట్ లిస్టులో ఉన్న మావోయిస్టు అగ్రనేత హిడమ స్వగ్రామమైన పూవర్తి -సీల్గేర్ రహదారి గ్రామాలను కలుపుతూ ప్రభుత్వాధికారులు బెయలి ( ఇనుప యాంగులర్స్ తో తయారుచేసిన ) వంతెన నిర్మాణం పూర్తి చేశారు. వర్షాకాలం వచ్చిందంటే తీవ్ర ఇబ్బందులకు గిరిజన ప్రాంత ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులకు గురి అయ్యేవారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం అవడంతో కల్వర్టులు నిర్మించడం కష్టమని తక్కువ సమయంలో జరిగేలా ఇనుముతో వంతెన నిర్మించారు. బేయిలి బ్రిడ్జ్ నిర్మాణంతో కష్టాలన్నీ తీరిపోయాయి. ఈ వంతెన వల్ల తిమ్మాపురం, టేకల్గుడ, గొల్ల కొండ, తూమలపాడు, జబ్బగట్ట, పువర్తి గ్రామాలతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు ప్రయోజనం చేకూరుతుంది.బేయిలి వంతెన నిర్మాణం కారణంగా గ్రామస్తులు ఆనందంలో తేలియాడు తున్నారు. గత నాలుగు దశాబ్దాలుగా తూర్పు ప్రాంతం మావోయిస్టుల అధీనంలో ఉంది. హీడమ, దేవా వంటి మావోయిస్టులు దాడులు చేసే ప్రాంతం ఇదే. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో ఈ ప్రాంతంలో సిఆర్పిఎఫ్ క్యాంపులు తెరవడం తో అభివృద్ధి పనులు నిరంతరంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వాగుల మీద వంతెనలు లేకపోవడంతో ఏళ్ళ తరబడి కష్టాలు పడుతున్న గ్రామస్తులకు ప్రభుత్వం అతి తక్కువ సమయంలో వంతెన నిర్మించారు. ఈ వంతెన పూర్తి అయ్యేంతవరకు ఆయా గ్రామాల్లో ఉత్కంఠత నెలకొంది. హిడమ కంచుకోటలో 53 కోట్లతో రోడ్ల అభివృద్ధి జరుగుతుంది. ఇప్పటికి 2024-25 సంవత్సరంలో బేయిలీ బ్రిడ్జితో పాటు 64 కిలోమీటర్ల రహదారిని నిర్మించడానికి ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. దీనికిగాను 66 కోట్ల 74 లక్షలు మంజూరయ్యాయి. ఎల్మాగూడా ఖమ్మం నుండి దూలేడ్, పువ్వర్తి వరకు 51 కిలోమీటర్ల రహదారిని నిర్మించనున్నారు. సిల్గేరు,పువర్తి రోడ్డులోని తిమ్మాపురం గ్రామ సమీపంలో 15 మీటర్ల పొడవున్న బెయిలీ వంతెనతో పాటు, ఎలాంటి ఆటంకాలు లేకుండా భద్రత దళాల ప్రతిక్షణం పర్యవేక్షణలో అభివృద్ధి పనులు సాగుతున్నాయి. ఈ బ్రిడ్జి నిర్మాణంతో సుమారు 12 గ్రామాల లోని ఐదువేల పైబడి ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది. జిల్లా పంచాయతీ సభ్యుడు కోర్స నన్ను మాట్లాడుతూ కేంద్రంలో మోడీ ప్రభుత్వం హామీకి గాను చతిస్గడ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ సాయి, హోంమంత్రి విజయ్ శర్మ, ఇన్చార్జ్ మంత్రి కేదార్ కస్యప్ కృషితో మావోయిస్టు అగ్రనేత హిడమా కంచుకోటగా భావిస్తున్న గిరిజన ప్రాంతంలో, ఏళ్ల తరబడి వెనుకబడి ఉన్న మా ప్రాంతాన్ని అభివృద్ధి వేగవంతం చేశారని అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. (Story: హీడమా కంచుకోటలో బెయలి వంతెన నిర్మాణం)