వినుకొండ లో చోరీ..
న్యూస్ తెలుగు /వినుకొండ :పట్టణంలోని సిద్ధార్థ నగర్ లో నివాసం ఉంటున్న ఆర్టీసీ కండక్టర్ సన్నగంటి జయలక్ష్మి ఇంట్లో చోరీ జరిగింది. ఇంట్లో ఉన్న సుమారు 100గ్రాముల బంగారం చోరీకి గురైంది. దీని విలువ 9లక్షల పైగానే ఉంటుంది. దీంతోపాటు వెండి వస్తువులు ఐదువేల నగదు అపహరణకు గురైంది. బాధితురాలు జయలక్ష్మి పోలీసులకు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈనెల 17న షిరిడీకి వెళ్లి శుక్రవారం ఉదయం 10 గంటలకు ఇంటికి రావడం జరిగిందన్నారు. ఇంటి గ్రిల్లుకు వేసిన తాళం తీసి ఉన్నట్లు చెప్పారు తాళం పగలగొట్టకుండా తాళం చెవితో తీసినట్లు పోలీసులు గుర్తించారు. మెయిన్ డోర్ కు తాళం వేయలేదని ఆమె తెలిపారు. ఇంట్లో సామాన్లు చిందర తొందరగా పడేసి ఉన్నాయి. బంగారు వస్తువులను హాల్లోని కబోర్డు లో పాత సామాన్లలో పెట్టినట్లు ఆమె తెలిపారు. దొంగలు ప్రతి గదిలోని సామాన్లను క్షుణ్ణంగా పరిశీలించినట్లు కనిపించింది.
మూడు జతల చెవి కమ్మలు, గాజు ఒకటి, చైన్ ఒకటి, చిన్న చైన్లు రెండు, ఉంగరాలు మూడు, నక్లెస్ ఒకటి, పగడాల గొలుసు ఒకటి,లాకెట్ ఒకటి, పూసల గొలుసు ఒకటి వీటితోపాటు వెండి వస్తువులు లను దొంగలు ఎత్తుకెల్లినట్లు బాధితురాలు తెలిపింది. సంఘటన ప్రాంతాన్ని ఇన్చార్జి సీఐ సుహాసిని ఎస్సై సుభాని లు సిబ్బందితో కలిసి పరిశీలించారు. అనంతరం క్లూస్ టీం సంఘటన ప్రాంతంలో వేలిముద్రలను సేకరించారు. అలాగే క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సంఘటన ప్రాంతానికి చేరుకొని వివరాలను తెలుసుకున్నారు. (Story:వినుకొండ లో చోరీ..)