Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌అధికారులే బలి పశువులా..!

అధికారులే బలి పశువులా..!

అధికారులే బలి పశువులా..!

ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ కాంప్లెక్స్ కూల్చివేత వ్యవహారంలో విశాఖలో రగడ..

అప్పటి జీవీఎంసీ కమిషనర్ సృజన ఆదేశాలతోనే చర్యలు..

విజయసాయిరెడ్డి సిఫార్సులతో విపక్షాల నేతల ఆస్తులపై కూల్చివేతలు..

జై కొట్టి తలగ్గిన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు..!

కింద స్థాయి అధికారులపై చర్యలు సమంజస మేనా..?

న్యూస్ తెలుగు /విశాఖపట్నం: రాజకీయ పార్టీల నేతల ఆస్తులపై కక్షపూరిత చర్యల వ్యవహారంలో కింద స్థాయి అధికారులను బలి పశువులుగా చేస్తున్నారు. వైసిపి ప్రభుత్వం లో అప్పటి ఉత్తరాంధ్ర ప్రాంతీయ సమన్వయకర్తగా ఉన్న విజయసాయిరెడ్డి సిఫార్సులు మేరకే ప్రతి శని ఆదివారాల్లో విపక్ష పార్టీ నేతల ఆస్తుల ధ్వంసం మున్సిపల్, రెవెన్యూ , పోలీస్ అధికారుల ద్వారా జరిగేవి అనేది జగమెరిగిన సత్యం. అప్పటి జీవీఎంసీ కమిషనర్ గా జి సృజన పనిచేసిన కాలంలో గీతం యూనివర్సిటీ ప్రహరీ గోడ కూల్చివేత, మాజీ ఎంపీ సబ్బం హరి ఇంటి ప్రహరీ గోడ కూల్చివేత, ద్వారకా నగర్ లో అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ సత్యనారాయణ షాపింగ్ కాంప్లెక్స్ ను , గాజువాక మాజీ ఎమ్మెల్యేగా ఉన్న పల్లా శ్రీనివాసరావు షాపింగ్ కాంప్లెక్స్ ను గాజువాకలో కూల్చివేత చేయాలని కమిషనర్ గా ఆమె ఆదేశాలు ఇవ్వడంతోనే అప్పటి టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేత చర్యలు చేపట్టారు. అయితే తాజాగా ఆదేశించిన ఐ ఏ ఎస్ అధికారులను వదిలిపెట్టి కింద స్థాయి టౌన్ ప్లానింగ్ లో అధికారులను సస్పెండ్ చేస్తూ, మరో ఇద్దరి ఉన్నతాధికారులకు సోకోజ్ నోటీసులు ఇవ్వడం పై టౌన్ ప్లానింగ్ అధికారులు ఆవేదన చెందుతున్నారు.
పై అధికారులు ప్రజా ప్రతినిధుల ఒత్తిళ్లకు తలోగ్గి కింద స్థాయి అధికారులను బలి పశువులను చేయడం ఎంతవరకు సమంజసం అని వెంటనే ఈ చర్యలు నిలుపుదల చేయాలని పలువురు టౌన్ ప్లానింగ్ అధికారులు కోరుతున్నారు.
ఏపీ టీడీపీ ప్రస్తుత అధ్యక్షులు, గాజువాక శాసన సభ్యులు పల్లా శ్రీనివాసరావు 2021లో గాజువాకలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టారు. అయితే అప్పుడు మాజీ శాసనసభ్యులు హోదాలో ఉన్న పల్లా తన షాపింగ్ నిర్మాణంకోసం తగిన అనుమతులు తీసుకున్నారు. అయితే అప్పటి వైసీపీ ప్రభుత్వంలో ఎంపీ విజయసాయిరెడ్డి ఆదేశాల మేరకు జీవీఎంసీ లో సుదీర్ఘకాలం కమిషనర్ గా పనిచేసిన జి సృజన ఆదేశాల మేరకే అనేక విపక్ష నేతల కూల్చివేతలు జరిగాయని పెద్ద ఎత్తున ప్రచారం సాగింది.
ఉత్తరాంధ్ర సీఎంగా విజయసాయిరెడ్డి అప్పట్లో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను తన గుప్పెట్లో పెట్టుకుని శని, ఆదివారాలు సెలవుల నేపథ్యంలో కోర్టుకు వెళ్లకుండా టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, పోలీస్ ఇతర శాఖల అధికారులతో ముకుమ్మడిగా జెసిబి లతో కూల్చివేత కార్యక్రమాలు చేపట్టారు. అందుకు అప్పటి ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు జై కొట్టి కింద స్థాయి సిబ్బందితో అధికారులతో వైసిపి పెద్దలను సంతృప్తిపరిచే వారు అన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్నాయి.
2021 ఏప్రిల్ 25న తెల్లవారు జామున 3.30 గంటలకు హడావుడిగా గోడకు ఒక నోటీసు అంటించి అదే నోటీసును ఆన్ లైన్ ద్వారా పల్లా శ్రీనివాసరావుకు పంపించినట్లు రికార్డులో పొందు పరిచారు. ఆ తర్వాత తెల్లవారుజామున మూడున్నర గంటల నుంచి ఇష్టానుసారంగా నిబంధనలకు విరుద్ధంగా టౌన్ ప్లానింగ్ అధికారులు పల్లా షాపింగ్ కాంప్లెక్స్ ను కూల్చివేశారు. అనుమతులు ఉన్నప్పటికీ సుమారు 20 అడుగుల వరకు లోతుకు వెళ్లి కాంప్లెక్స్ నిర్మాణం కూల్చివేయగా, భారీ నష్టం వాటిల్లినట్లు తాజాగా లెక్కలు తేల్చారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో రాష్ట్ర టీడీపీ అధ్యక్షులుగా ఉన్న గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గతంలో ఫిర్యాదు చేసిన పలు అంశాలు పై కూటమి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. సిడిఎంఏ కమిషనర్ హోదాలో సంపత్ కుమార్ ప్రాథ మిక విచారణ నిర్వహించారు. గత వైసిపి ఐదేళ్ల పాలనలో విశాఖ తో పాటు అనేక నగరాల్లో ఆయా నిర్మాణాలు కూల్చివేతకు సంబంధించి విచారణ జరిపిన వివరాలను సేకరించారు. దీంతో ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర మున్సిపల్ పరిపాలన విభాగం సీరియస్ గా స్పందించింది. ఇందుకు బాధ్యులుగా
రాష్ట్ర టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ ఆర్.జె. విద్యుల్లత తో పాటు జీవీఎంసీ ప్రస్తుత చీఫ్ సిటీ ప్లానర్ ఎ. ప్రభాకర్ కు ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వీరిద్దరితోపాటు మరో ముగ్గురు ప్లానింగ్ ఉన్నతాధి కారులను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర మున్సిపల్ పరిపాలన విభాగం ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ సురేష్ కుమార్ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. అప్పటి గాజువాక ఏసిపి గా, డీసీపీ గా పనిచేసిన టి నరేందర్ రెడ్డి, టిపివో యస్ వినయ్ ప్రసాద్, టి పి ఎస్ యస్ వరప్రసాద్ లను సస్పెం డ్ చేస్తూ ప్రభుత్వం బుధవారం రాత్రి జీవో నెంబర్లు 707 709, 710 విడుదల చేసింది. అలాగే అప్పటి జీవీఎంసీ చీఫ్ సిటీ ప్లానర్ ప్రస్తుత రాష్ట్ర టౌన్ ప్లానింగ్ డైరెక్టర్. ఆర్జే విద్యుల్లతకు అప్పటి సిటీ ప్లానర్ ప్రస్తుత గ్రేటర్ చీఫ్ సిటీ ప్లానర్. ఏ ప్రభా కర్లకు తగిన వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీ సులు జారీ చేయడం జరిగింది. (Story :అధికారులే బలి పశువులా..!)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!