టిడిపి ఆధ్వర్యంలో
గుర్రం జాషువాకు ఘన నివాళులు
న్యూస్ తెలుగు / వినుకొండ : నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా వర్ధంతి సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు ఆదేశాల మేరకు వినుకొండ టిడిపి నాయకులు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద గల గుర్రం జాషువా కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. సందర్భంగా నాయకులు మాట్లాడుతూ. పేదల అభ్యున్నతికై అక్షర సమరాన్ని సాగించిన గుర్రం జాషువా స్ఫూర్తితో ప్రతి ఒక్కరు ముందుకు సాగాలని కోరారు. జాషువా రచనలతో సమాజాన్ని జాగృతం చేసిన తీరును వివరించారు. సమాజ శ్రేయస్సు జాషువా చేసిన కృషిని జ్ఞాప్తికి తెచ్చుకొని జోహార్లు అర్పించారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు. (Story:టిడిపి ఆధ్వర్యంలో గుర్రం జాషువాకు ఘన నివాళులు)