కార్పొరేట్ దిగ్గజాలకు రాయితీలు సంపద సృష్టించే శ్రమజీవులకు భారాలు
నూతన జిల్లాల అభివృద్ధికి స్పెషల్ ప్యాకేజీ కేటాయించాలి
ఉమ్మడి జిల్లా పెండింగ్ ప్రాజెక్టులు తక్షణమే పూర్తి చేయాలి
-ఎం.బాల్ నరసింహ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు
రెండో రోజు కొనసాగిన సిపిఐ వనపర్తి జిల్లా మూడో మహాసభలు
న్యూస్‌తెలుగు/ వనపర్తి : దేశంలో బడా కార్పొరేట్ వ్యాపార దిగ్గజాలకు రాయితీలు, బ్యాంకు రుణాల మాఫీలు చేస్తున్న మోడీ ప్రభుత్వం దేశ సంపద సృష్టికర్తలైన శ్రమజీవులకు మాత్రం తరతరాలుగా శ్రమ దోపిడికి గురి చేస్తూ మోయలేని భారాలు మోపడం సిగ్గుచేటని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.బాల్ నరసింహ ఆరోపించారు.ఆత్మకూరు మండల కేంద్రంలోని ఎం.జీ.గార్డెన్ లో భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) వనపర్తి జిల్లా మూడో మహాసభలు గురువారం రెండో రోజు ప్రతినిధుల సభ జరిగింది. ముందుగా సిపిఐ వనపర్తి జిల్లా మూడో మహాసభల ప్రారంభ సూచికంగా అరుణ పతాకాన్ని సిపిఐ సీనియర్ నాయకులు సి నరసింహశెట్టి ఆవిష్కరించారు.సిపిఐ జిల్లా కార్యదర్శి కే.విజయరాములు కార్యదర్శి నివేదిక ప్రవేశపెట్టారు.
సిపిఐ వనపర్తి జిల్లా మహాసభ ప్రతినిధుల సభలో ఎం.బాల్ నరసింహ ప్రసంగిస్తూ:-దేశంలో సగటు జాతీయ ఆదాయంలో 80 శాతం ఆదానీ అంబానీ లాంటి కుబేరుల చేతుల్లో సంపద కేంద్రకృతం అవుతుందని అన్నారు. దీని ఫలితంగా వ్యవస్థలో ప్రజల మధ్య తీవ్రమైన ఆర్థిక సంక్షోభం నెలకొన్నదని అన్నారు. వెనుకబాటుకు నెలవైన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని డిమాండ్ చేశారు.రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులు బీమా, సంగంబండ,భూత్ పూర్, నెట్టెంపాడు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం తక్షణమే పూర్తి చేసి రైతులకు సాగును అందించాలని డిమాండ్ చేశారు.కొత్తగా ఏర్పడిన జిల్లాలకు సరైన వనరులు లేవని అనేక మండలాలు మున్సిపాలిటీలు రెవెన్యూ డివిజన్స్ ఏర్పాటు అయినప్పటికీ సొంత భవనాలు, సిబ్బంది లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని కనుక రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కేటాయించి అభివృద్ధికి బాటలు వేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కే.విజయ రాములు,సిపిఐ జిల్లా నాయకులు శ్రీహరి, కళావతమ్మ,మోష, అబ్రహం,రమేష్, శ్రీరాములు,జె.చంద్రయ్య, గోపాలకృష్ణ,రాబర్ట్, లక్ష్మీనారాయణ శెట్టి,మాషప్ప, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కుతూబ్, శ్యాంసుందర్, రవీందర్, లక్ష్మీనారాయణ,ఖాజా పీర్,గొల్ల అంజి,మహేష్, కుమార్,అంజి,ఎర్రన్న ఇజ్రాయిల్,కురుమన్న, వరుణ్,పృధ్వినాదం, వెంకటేశ్వర రెడ్డి,గీతమ్మ కృష్ణవేణి,జయమ్మ,పార్వతమ్మ, చిన్నమ్మ, ప్రజానాట్యమండలి కళాకారులు తుపాకుల వెంకటేష్,చందు,మధు, నరసింహ,కృష్ణ,గౌని బాలస్వామి తదితరులు పాల్గొన్నారు. (Story:కార్పొరేట్ దిగ్గజాలకు రాయితీలు సంపద సృష్టించే శ్రమజీవులకు భారాలు)