సైబర్ నేరాలపై విద్యార్థులు.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి
న్యూస్ తెలుగు/సాలూరు : సైబర్ నేరాలపై విద్యార్థులు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అదనపు జిల్లా ఎస్పీ అంకిత సురనా అన్నారు సాలూరు పట్టణంలో వెలమపేట కళ్యాణమండపంలో విద్యార్థులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమం పట్టణ సీఐ అప్పలనాయుడు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు, యువత, ప్రజలు మత్తు పదార్ధాలు సేవించి మీ యొక్క జీవితాలు నాశనం చేసుకోవద్దని అన్నారు. 18 సంవత్సరాల నిండిన విద్యార్థులు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలని అన్నారు. రోడ్లపై నిర్లక్ష్యంగా డ్రైవింగ్ నడపవద్దని అన్నారు. రోడ్లపై నడిచేటప్పుడు ఎదుటి వారికి ఇబ్బంది కలగకుండా నడవాలని అన్నారు. ఈరోజు సెల్ ఫోన్ ప్రభావం వల్ల చాలా అనర్ధాలు జరుగుతున్నాయని, అందులో మంచిని గ్రహించి చెడును విడిచిపెట్టాలని అన్నారు, ఈ మధ్యకాలంలో ఎక్కువగా సైబర్ నేరాలు జరుగుతున్నాయని వాటిపై అప్రమత్తంగా ఉండవలసిన బాధ్యత విద్యార్థులు ప్రజలపై ఉందని అన్నారు. మహిళలకు, చిన్నపిల్లలకు రక్షణ గా ఉండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. (Story:సైబర్ నేరాలపై విద్యార్థులు.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి)