Home వార్తలు జూలై 26న ‘మిరాయ్’  రిలీజ్

జూలై 26న ‘మిరాయ్’  రిలీజ్

0

జూలై 26న ‘మిరాయ్’  రిలీజ్

న్యూస్‌తెలుగు/ హైద‌రాబాద్ సినిమా:  హనుమాన్ సినిమాతో దేశవ్యాప్తంగా అలరించిన సూపర్ హీరో తేజ సజ్జా, ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మాణంలో, కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘మిరాయ్’ తో వస్తున్నారు. ఈ సినిమా టీజర్ దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. గ్రాండ్ విజువల్స్, అద్భుతమైన కథ,  ఫాంటసీ యూనివర్స్ తో మిరాయ్ సూపర్ హీరో జానర్ ని రీడిఫైన్ చేయబోతుందని ప్రామిస్ చేస్తోంది.

జూలై 26న విడుదలయ్యే ఫస్ట్ సింగిల్ వైబ్ ఉందితో ఈ మూవీ మ్యూజిక్ ప్రమోషన్‌లు ప్రారంభం కానున్నాయి. టైటిల్, పోస్టర్ చూస్తుంటే కచ్చితంగా ఓ హై ఎనర్జీ టెక్నో బీట్ సాంగ్ ని అర్ధమౌతోంది. లీడ్ పెయిర్ తేజ సజ్జా – రితికా నాయక్ మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంది.

తేజ సజ్జా స్టైలిష్ అవుట్‌ఫిట్‌లో, రఫ్ అండ్ టఫ్ గా, హీరోయిక్ ఆరాతో అదిరిపోయే లుక్‌లో కనిపించారు. రితికా అయితే గ్లామరస్ గా, తేజను ఇంటెన్స్‌గా చూస్తూ ఓ బ్యూటీఫుల్ మూడ్‌ క్రియేట్ చేస్తుంది. బ్యాక్ డ్రాప్లో  మెరిసే గోల్డెన్ ఎనర్జీ స్పార్క్స్ మ్యాజికల్ ఫీల్ ఇస్తూ, మిరాయ్ మైథో-ఫాంటసీ టచ్‌ను హైలైట్ చేస్తుంది.

మనోజ్ మంచు ఈ సినిమాలో పవర్ ఫుల్ విలన్‌గా కనిపించబోతున్నారు. శ్రీయ శరణ్, జయరామ్, జగపతిబాబు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని మిరాయ్ దర్శకత్వం వహించడమే కాకుండా, సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అలాగే స్క్రీన్‌ప్లేను కార్తీక్ స్వయంగా రూపొందించారు. మణిబాబు కరణం రచన, సంభాషణలకు కీలకంగా పని చేశారు. శ్రీ నాగేంద్ర తంగాల ఆర్ట్ డైరెక్టర్, సుజిత్ కుమార్ కొల్లి నిర్మాణాన్ని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్.

కార్తికేయ 2, జాట్ లాంటి హిట్స్ ఇచ్చిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను భారీగా నిర్మిస్తోంది. మిరాయ్ తో పాన్-ఇండియా స్థాయిలో మరింత ముందడుగు వేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ లో గ్రాండ్ విజువల్స్, హై ప్రొడక్షన్ వాల్యూస్‌తో గ్లోబల్ లెవెల్‌కి చేరింది. ఈ చిత్రంలో రికార్డు స్థాయిలో VFX షాట్స్ ఉండబోతున్నాయి.

సెప్టెంబర్ 5న ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా విడుదలకానుంది. 2D, 3D ఫార్మాట్లలో 8 భాషల్లో థియేటర్లలోకి వస్తుంది.

తారాగణం: సూపర్ హీరో తేజ సజ్జా, మనోజ్ మంచు, రితికా నాయక్, శ్రియ శరణ్, జయరామ్, జగపతి బాబు

సాంకేతిక బృందం:
దర్శకత్వం: కార్తీక్ ఘట్టమనేని
నిర్మాతలు: TG విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్
బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సుజిత్ కుమార్ కొల్లి
సంగీతం: గౌర హరి
ఆర్ట్ డైరెక్టర్: శ్రీ నాగేంద్ర తంగాల
రైటర్: మణిబాబు కరణం
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: హాష్టాగ్ మీడియా (Story:జూలై 26న ‘మిరాయ్’  రిలీజ్)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version