Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ ఆగస్టు 7, 8 తేదీల లో వినుకొండ లో జరిగే భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ...

ఆగస్టు 7, 8 తేదీల లో వినుకొండ లో జరిగే భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పల్నాడు జిల్లా రెండవ మహాసభలను జయప్రదం చేయండి

0

ఆగస్టు 7, 8 తేదీల లో వినుకొండ లో జరిగే భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పల్నాడు జిల్లా రెండవ మహాసభలను జయప్రదం చేయండి

సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్.

న్యూస్ తెలుగు/వినుకొండ  : వినుకొండ పట్టణంలో ఆగస్టు 7, 8 తేదీలలో జరుగనున్న భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పల్నాడు జిల్లా రెండవ మహాసభలను జయప్రదం చేయాలని సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బుధవారం నాడు వినుకొండ పట్టణంలోని వివిధ ప్రాంతాలలోని వివిధ కూడళ్ళలో ప్రజా సమూహాలను, వ్యాపార వర్గాలను, కార్మిక సంఘాలు, వివిధ ప్రజా సంఘాలు, డాక్టర్లు, లాయర్లు, రైతు సంఘాలను, మేధావి వర్గాలను కలిసి మహాసభలను జయప్రదం చేయాలని విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగస్టు 7,8 తేదీలలో వినుకొండలో జరిగే జిల్లా మహాసభలలో మొదటి రోజున 7వ తేదీన వేలాది మందితో పట్టణంలో గొప్ప ప్రదర్శన అనంతరం శివయ్య స్తూపం వద్ద గొప్ప బహిరంగ సభ జరుగుతుందని ఈ బహిరంగ సభలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ కే. రామకృష్ణ, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కామ్రేడ్ ముప్పాళ్ళ నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్, ఈశ్వరయ్య జిల్లా నాయకులు ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొని ప్రసంగిస్తారని ఈ ప్రదర్శన బహిరంగ సభలలో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ విస్తృత ప్రచార కార్యక్రమంలో ఆహ్వాన సంఘం గౌరవ అధ్యక్షులు సండ్రపాటి సైదా, అధ్యక్షులు మారుతి వరప్రసాద్, ప్రధాన కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు, కోశాధికారి ఉలవలపూడి రాము, ఉపాధ్యక్షులు రాయబారం వందనం, షేక్ కిషోర్, కార్యదర్శులు పిన్నె బోయిన వెంకటేశ్వర్లు,కె. మల్లికార్జునరావు, షేక్ కొండ్రముట్ల చిన సుభాని, దారివేముల మరియ బాబు తదితరులు పాల్గొన్నారు.(Story : ఆగస్టు 7, 8 తేదీల లో వినుకొండ లో జరిగే భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పల్నాడు జిల్లా రెండవ మహాసభలను జయప్రదం చేయండి )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version