Home వార్తలు ‘కరుప్పు’ టీజర్ 

‘కరుప్పు’ టీజర్ 

0

‘కరుప్పు’ టీజర్ 

న్యూస్‌తెలుగు/ హైద‌రాబాద్ సినిమా: సూర్య తన మాగ్నమోపస్ మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ #సూర్య45 కోసం దర్శకుడు ఆర్జే బాలాజీతో చేతులు కలిపారు. ఈ మోస్ట్ ఎవైటెడ్ మూవీని అనేక విజయవంతమైన చిత్రాలను నిర్మించడం ద్వారా పేరును తెచ్చుకున్న నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తోంది. తమిళం, తెలుగు, హిందీ పరిశ్రమలలో పాపులర్ కంటెంట్‌ను అందించిన డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ  చిత్రాన్ని స్కేల్, కంటెంట్ రెండింటినీ దృష్టిలో ఉంచుకుని ప్రతిష్టాత్మకగా తెరకెక్కిస్తోంది.

సూర్య ఫ్యాన్స్‌ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ‘కరుప్పు’ ఫస్ట్ లుక్ టీజర్‌ సూర్య బర్త్‌డే సందర్భంగా రిలీజ్ అవ్వడంతో ఫ్యాన్స్‌కి ఇది డబుల్ ట్రీట్‌ అయింది. టీజర్ ఓ మాస్ పండుగలా ఉంటుంది.

సూర్య పవర్‌ఫుల్ అవతార్‌లో అదిరిపోయే లుక్‌తో కనిపించారు. ఆ ఇంటెన్సిటీ, ఆ స్క్రీన్ ప్రెజెన్స్ అంచనాలుకు మించి వుంది. 1 నిమిషం38 సెకన్ల టీజర్‌లో మాస్ మోమెంట్స్, ఫైర్ విజువల్స్, పవర్ ఫుల్ బీజీఎం అన్నీ అద్భుతంగా వున్నాయి.

ఆర్జే బాలాజీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా, ఆయనకు  మాస్ జానర్‌లో చేసిన తొలి ప్రాజెక్ట్. సోషల్ కథలతో గుర్తింపు తెచ్చుకున్న బాలాజీ  ఇప్పుడు సూర్యతో కలిసి ఒక స్ట్రాంగ్, కమర్షియల్ సినిమాని తీసుకొచ్చారని టీజర్ చూస్తే అర్ధమౌతోంది.

జీకే విష్ణు సినిమాటోగ్రఫీ చాలా గ్రాండ్‌గా ఉంది. ప్రతి సీన్ లో గ్రాండ్ నెస్  కనిపిస్తోంది. సాయి అభ్యంకర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌  టీజర్‌కు జోష్ తీసుకొచ్చింది. సాయి ప్రస్తుతం యంగ్ మ్యూజిక్ సెన్సేషన్‌గా ఎదుగుతున్నాడు, ఈ మూవీ అతని కెరీర్‌లో టర్నింగ్ పాయింట్‌ కానుంది.

అరుణ్ వెంజరాముడు ప్రొడక్షన్ డిజైన్ విజువల్స్‌కి మంచి డెప్త్‌ వచ్చేసింది. ఎడిటింగ్ లో కలైవాణన్‌ కట్‌లూ పర్ఫెక్ట్, పేస్ తగ్గకుండా స్టైల్ చూపించారు. యాక్షన్‌ కొరియోగ్రఫీ అదిరిపోయింది. అన్బరివ్, విక్రమ్ మోర్ కలిసి పర్ఫెక్ట్ మాస్ సీక్వెన్స్‌లు అందించారు.

త్రిష లుక్‌ని మాత్రం ఇంకా రివీల్ చేయలేదు, థియేట్రికల్ ట్రైలర్‌ కోసం హోల్డ్ చేసారు. ఇతర క్యాస్టింగ్ కూడా చాలా బలంగా ఉంది. ఇంద్రన్స్, స్వసిక, అనఘ మాయ రవి, శివధా, నట్టి, సుప్రీత్ రెడ్డి ఇలా ఒక్కొక్కరు బలమైన పాత్రల్లో కనిపించనున్నారు.

ఈ సినిమాని ఫెస్టివల్ రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నారు. ఈ టీజర్ చూసాక కరుప్పు మాస్‌కి ఓ గిఫ్ట్‌లా రాబోతుందని అర్ధమౌతోంది. పండగ సెలబ్రేషన్ ఇప్పుడే మొదలైంది.

తారాగణం: సూర్య, త్రిష, ఇంద్రన్స్, నట్టి, స్వసిక, అనఘ మాయ రవి, శ్శివాడ, సుప్రీత్ రెడ్డి

రచన & దర్శకత్వం: RJ బాలాజీ
సినిమాటోగ్రఫీ – జికె విష్ణు
సంగీతం – సాయి అభ్యంకర్
యాక్షన్ అన్బరివ్ – విక్రమ్ మోర్
ఎడిటర్ – ఆర్.కళైవానన్
ప్రొడక్షన్ డిజైన్ – అరుణ్ వెంజారామూడు
నిర్మాతలు: ప్రకాష్ బాబు, ఎస్.ఆర్. ప్రభు
పీఆర్వో – వంశీ-శేఖర్ (Story:’కరుప్పు’ టీజర్ )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version