మెగా కంటి వైద్య శిబిరం
న్యూస్ తెలుగు /వినుకొండ :శివశక్తి లీలా & అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో, ,శంకర కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో ఈనెల 14న ,ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్ మరియు వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు మరియు శివశక్తి లీలా & అంజన్ ఫౌండేషన్ చైర్మన్ గోనుగుంట్ల లీలావతి చే నిర్వహించిన మెగా క్యాంప్ లో భాగంగా సోమవారం నుంచి శుక్లాములకు ఎంపికైన వారిని ఆపరేషన్ కొరకు బస్సుల్లో తరలించడం జరిగింది. అందులో భాగంగా ఈనెల 30వ తారీఖు వరకు రోజుకి రెండు బస్సులు వస్తాయని ఆపరేషన్కు అనుమతించిన వారు ఎన్ఎస్పి గ్రౌండ్ ఎదురుగా ఉన్న సాయిబాబా టెంపుల్ వద్దకు రాగలరని శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ మేనేజర్ రమేష్ కుమార్ తెలపడం జరిగింది. (Story:మెగా కంటి వైద్య శిబిరం )

