పల్నాడు జిల్లా రెండవ మహాసభలు జయప్రదం చేయండి
న్యూస్ తెలుగు/వినుకొండ :భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పల్నాడు జిల్లా ద్వితీయ మహాసభలను జయప్రదం చేయాలని సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతీ వరప్రసాద్ తెలిపారు. సోమవారం నాడు వినుకొండ పట్టణంలోని శివయ్య భవన్లో రెండవ మహాసభల వాల్ పోస్టర్ విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ. కామ్రేడ్ వల్లూరి గంగాధరరావు జిల్లా కార్యదర్శిగా రిలీవ్ అవుతూ కామ్రేడ్ జివి కృష్ణారావు జిల్లా కార్యదర్శి అయిన సందర్భంగా వినుకొండలో జిల్లా మహాసభలు ఘనంగా నిర్వహించామని అనంతరం 2015లో ఉమ్మడి గుంటూరు జిల్లా లో జిల్లా మహాసభలు ఘనంగా నిర్వహించడం జరిగిందని పల్నాడు జిల్లా విభజన తర్వాత మొదటి మహాసభ 2022 లో నరసరావుపేట లోను రెండవ మహాసభను వినుకొండలో జరుపుకోవాలని నిర్ణయించి మహాసభల కార్యక్రమాలను వేగవంతంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ మహాసభల ప్రారంభ రోజు ఆగస్టు 7వ తేదీన మధ్యాహ్నం మూడు గంటలకు వినుకొండ పట్టణంలో వేలాది మంది రెడ్ షర్ట్ వాలంటీర్ల తో భారీ ప్రదర్శన అనంతరం శివయ్య స్తూపం వద్ద సాయంత్రం 4 గంటలకు గొప్ప బహిరంగ సభ జరుగుతుందని ఈ సభలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ కే. రామకృష్ణ, రాష్ట్ర సహాయ కార్యదర్శి కామ్రేడ్ ముప్పాళ్ళ నాగేశ్వరరావు, కార్యదర్శివర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్,జి. ఈశ్వరయ్య జిల్లా నాయకులు తదితరులు హాజరై ప్రసంగిస్తారు కావున జిల్లా నలుమూలల నుండి సిపిఐ శ్రేణులు వేలాదిగా హాజరై ఆగస్టు 7వ తేదీన ప్రదర్శన, బహిరంగ సభలను, ఎనిమిదో తేదీన ప్రతినిధుల సభను జయప్రదం చేయాలని ఆయన కోరారు. వాల్ పోస్టర్ విడుదల సందర్భంగా పాల్గొన్న నాయకులు సిపిఐ మాజీ వైస్ చైర్మన్ సండ్రపాటి సైదా, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు, పట్టణ కార్యదర్శి ఉలవలపూడి రాము, సిపిఐ పట్టణ నాయకులు పటాన్ లాల్ ఖాన్, సిపిఐ నాయకులు షేక్ కిషోర్, కొప్పరపు మల్లికార్జునరావు, పిన్నబోయిన వెంకటేశ్వర్లు,ఎ. పవన్ కుమార్, షేక్ మస్తాన్, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. (Story:పల్నాడు జిల్లా రెండవ మహాసభలు జయప్రదం చేయండి)

