ప్రముఖ కవి కరీముల్లాకు హిందూపూర్ లో ఘన సత్కారం
న్యూస్ తెలుగు / వినుకొండ : హిందూపురంలో భారతీయ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో ప్రముఖ కవి కరీముల్లాకు తిరుపతి వేంకట కవులు సాహిత్య పురస్కారం ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు.. వక్తలు కరీముల్లా సాహిత్య సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో గజల్ శ్రీనివాస్, ప్రముఖ ఎడిటర్లు వై యస్ ఆర్ శర్మ ,బిక్కి కృష్ణ ,విమలసాహితి జనార్ధన్ తదితర జర్నలిస్టులు,కవులు, రచయితలు పాల్గొన్నారు. కరీముల్లా రాసిన పుస్తకాలు తెలుగు సాహిత్యంలో నూతన ఒరవడిని సృష్టించి తెలుగు భాషకు సరికొత్త సొగసులద్దాయని తెలిపారు. అబాబీలు అనే నూతన వచన కవితా ప్రక్రియ ఆవిష్కరించిన కరీముల్లా అనేక మంది కవులకు మార్గనిర్దేశకులయ్యారని ప్రశంసించారు.. భారతీయ సాహిత్య సేవాసమితి అధ్యక్షుడు, టిప్పుసుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షుడు ఉమర్ ఫారూఖ్ ఖాన్ నిర్వహించిన సభ విజయవంతమైంది. (Story:ప్రముఖ కవి కరీముల్లాకు హిందూపూర్ లో ఘన సత్కారం)
