Homeవార్తలుతెలంగాణకాంగ్రెస్ నిర్లక్ష్యం మూలంగా వట్టెం పంప్ హౌస్ నీట మునిగితే దానిని పట్టించుకున్న పాపాన పోలేదు

కాంగ్రెస్ నిర్లక్ష్యం మూలంగా వట్టెం పంప్ హౌస్ నీట మునిగితే దానిని పట్టించుకున్న పాపాన పోలేదు

కాంగ్రెస్ నిర్లక్ష్యం మూలంగా వట్టెం పంప్ హౌస్ నీట మునిగితే దానిని పట్టించుకున్న పాపాన పోలేదు

న్యూస్ తెలుగు/వనపర్తి : కాంగ్రెస్ నిర్లక్ష్యం మూలంగా వట్టెం పంప్ హౌస్ నీట మునిగితే దానిని పట్టించుకున్న పాపాన పోలేదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. పాలమూరు జిల్లా పర్యటనలో భాగంగా కొల్లాపూర్ నియోజకవర్గంలో నిర్వహించిన సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని శుక్రవారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా ఉరి తీసే సమయం కోసం రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారు అని ఆయన తెలిపారు. రేవంత్ చావు భాష చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారు అని ఆయన అన్నారు. పాలమూరును వలసల పాలు చేసిందే దశాబ్దాల కాంగ్రెస్ పాలన అని, గత పదేళ్లలో బీఆర్ఎస్ పాలనలో వలసల జిల్లాకే ఉపాధి కోసం వలసలు వచ్చేలా చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిది .. 19 నెలల కాంగ్రెస్ పాలనలో పాలమూరు నుండి తిరిగి వలసలు మొదలయ్యాయి అని అన్నారు. 2014 వరకు కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద నీళ్లు అందింది 13 వేల ఎకరాలకు మాత్రమే అని ఆయన చెప్పారు. కాంగ్రెస్ అంటే పెండింగ్ .. కేసీఆర్ అంటే రన్నింగ్ .. భీమా , నెట్టెంపాడు, కల్వకుర్తి, కోయిల్ సాగర్ వంటి పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి సాగునీరు అందించింది కేసీఆర్ అని ఆయన అన్నారు. జూరాల చివరి ఆయకట్టుకు సాగునీరు అందించిన ఘనత బీఆర్ఎస్ పార్టీది అని ఆయన అన్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల కింద దాదాపు 5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించిన ఘనత బీఆర్ఎస్ పార్టీది అని ఆయన చెప్పారు.90 శాతం పూర్తయిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులను 19 నెలలుగా పడావు పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం అని ఆయన చెప్పారు. పూర్తయిన టెండర్లను రద్దు చేసి వందల కోట్ల అదనపు భారం మోపుతున్న పాపం కాంగ్రెస్ ప్రభుత్వానిది అని, పాలమూరు బిడ్డను చెప్పుకుంటున్న రేవంత్ గత 19 నెలలలో తట్టెడు మన్ను ఎత్తిన పాపాన పోలేదు .. ఒక్కసారి కూడా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనుల మీద సమీక్ష చేయలేదు అని ఆయన విమర్శించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి తన మామ స్వర్గీయ సూదిని జైపాల్ రెడ్డి పేరు పెట్టుకున్నందుకయినా దాని పనులు వేగవంతం అవుతాయి అని అనుకున్నాం .. పేరు పెట్టి ఏడు నెలలు కావస్తున్నా పనుల్లో పురోగతి లేదుఅని ఆయన తెలిపారు. రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయి .. కాళ్లు తంగెళ్లు దాటడం లేదు అని ఆయన చెప్పారు. రేవంత్ నాయకత్వంలో పాలమూరుకు మేలు జరగడం సంగతి తర్వాత .. కీడు చేయకుంటే అదే పదివేలు అని ఆయన ఆరోపించారు. మే నెలలో కృష్ణా నదికి వరద మొదలైనా కల్వకుర్తి ఎత్తిపోతల మోటార్లు ఆన్ చేయకుండా 45 రోజులు కాంగ్రెస్ ప్రభుత్వం మీనమేషాలు లెక్కించిందిఅని ఆయన అన్నారు.నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ పాటికి సగం చెరువులు, కుంటలు నిండేవి అని ఆయన తెలిపారు. కేసీఆర్ గారి గురించి, ఆయన కుటుంబం గురించి రేవంత్ అనుచిత వ్యాఖ్యలు గర్హనీయంఅని ఆయన తెలిపారు. రాజకీయాల్లో హత్యలుండవ్ .. ఆత్మహత్యలే ఉంటాయి అని ఆయన తెలిపారు రాజకీయాల్లో ఎందరో నియంతలు నేలకూలారు.వారి సరసన భవిష్యత్తులో రేవంత్ చేరడం ఖాయంఅనిప్రభుత్వ అధికారిక సభలను రాజకీయ సభలుగా మార్చి ప్రతిపక్ష నేత మీద చావు భాష ప్రయోగిస్తున్న ఏకైక సీఎం రేవంత్ అని ఆయన విమర్శించారు.(Story : కాంగ్రెస్ నిర్లక్ష్యం మూలంగా వట్టెం పంప్ హౌస్ నీట మునిగితే దానిని పట్టించుకున్న పాపాన పోలేదు )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!