మున్సిపల్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెడికల్ క్యాంప్
న్యూస్ తెలుగు /వినుకొండ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్ మరియు వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ఆదేశాల మేరకు మున్సిపల్ చైర్ పర్సన్ డా. దస్తగిరి సూచనలతో మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం నందు జాషువా కళాప్రాంగణంలో డా.అంజి రెడ్డి హాస్పిటల్స్ నరసరావుపేట వారిచే ఈఎస్ఐ ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మెడికల్ క్యాంపులో ఉచిత ఓపి మరియు ఉచిత బిపి, షుగర్, గుండె పరీక్షలు( ఈసీజీ ) మొదలగునవి నిర్వహించి ఉచిత మందులు పంపిణీ చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని మున్సిపల్ అవుట్ డోర్ సిబ్బంది ప్రజారోగ్య విభాగం (పారిశుధ్య కార్మికులు) మరియు ఇంజినీరింగ్ సిబ్బంది మొదలైన వారు వైద్య పరీక్షలు చేయించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ షకీల దస్తగిరి, మేనేజర్ వెంకట్రావు, శానిటరీ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్, హాస్పిటల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. (Story:మున్సిపల్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెడికల్ క్యాంప్)
