నేటి నుండి పట్టణంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం ప్రారంభం
కూటమి ప్రభుత్వం చేసిన మోసాలను ప్రజలకు తెలపాలి.
వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు, మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లో లీడర్ ఎస్ వి వి రాజేష్
న్యూస్‌తెలుగు/ విజయనగరం : నేటి నుండి పట్టణంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని, దీని ద్వారా కూటమి ప్రభుత్వం చేసిన మోసాలను ప్రజలకు తెలియపరుస్తామని వైసిపి జిల్లా ఉపాధ్యక్షులు మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లో లీడర్ ఎస్ వి వి రాజేష్ అన్నారు. గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూమాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి సూచనలతో పట్టణంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం గడపగడపకు చేరేలా వార్డ్ పర్యటనల ఐదు రోజుల ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. దీనిలో భాగంగా నేడు రెండవ డివిజన్ పూల్ బాగ్ కాలనీ నుండి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామన్నారు. దీని ద్వారా కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసిన మోసాలను ప్రతి ఒక్కటి వివరిస్తామన్నారు. అమలు కానీ హామీలు ఇచ్చి కూటమి అధికారం చేపట్టిందన్నారు. చంద్రబాబుకు మోసపూరిత హామీలు ఇవ్వడం కొత్త కాదన్నారు. ఆయనను నమ్మి ఓట్లు వేసిన ప్రజలు ప్రస్తుతం ఎంతో బాధపడుతున్నారన్నారు. గతంలో ఎన్నోసార్లు ప్రజలను మోసం చేసిన ఘనత కేవలం చంద్రబాబుకు మాత్రమే దక్కిందన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలయ్యాలా చూడాలన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడి 13 నెలలు కావస్తున్న ఎక్కడ అభివృద్ధి లేదన్నారు. ప్రస్తుతం విజయనగరం నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నప్పటికీ ఎవరుపట్టించుకోవడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఆసపు వేణు, సంఘం రెడ్డి బంగారు నాయుడు, వైయస్సార్సీపి జిల్లా ప్రధాన కార్యదర్శి, ఈశ్వర్ కౌశిక్, వైఎస్ఆర్సిపి యువజన విద్యార్థి విభాగ ఇన్చార్జ్, కార్పొరేటర్లు పట్నాన పైడ్రాజు బండారు ఆనంద్, ఈసరపు రామకృష్ణ, వైఎస్ఆర్సిపి నాయకులు రెడ్డి గురుమూర్తి, అవనాపు లక్ష్మణరావు, తదితరులు పాల్గొన్నారు. (Story:నేటి నుండి పట్టణంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం ప్రారంభం )