ఇంగ్లిష్ గెస్ట్ లెక్చరర్ పోస్టు కొరకు
దరఖాస్తుల ఆహ్వానం
న్యూస్ తెలుగు/చింతూరు : స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల చింతూరు నందు ఖాళీగా ఉన్న ఇంగ్లిష్ పోస్టుకు అతిధి అధ్యాపకుల ప్రాతిపదికన భర్తీ చేయాలని ఇంటర్మీడియట్ విద్యాశాఖ కమిషనర్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది.సంబంధిత సబ్జెక్ట్ నందు పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో 50% శాతం మార్కులతో ఉత్తిర్ణత కలిగి ఉండాలని, భోదనా అనుభవం ఉన్న వారికీ ప్రాధాన్యత ఉంటుందని, అదేవిధంగా పదవి విరమణ పొందిన ప్రిన్సిపల్స్,జూనియర్ లెక్చరర్స్,స్కూల్ అసిస్టెంట్స్,ప్రొఫెసర్స్ కూడా దరఖాస్తు చేసుకోవచ్చని కళాశాల ప్రిన్సిపాల్ కే.రమేష్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు.పూర్తి వివరాలకు కొరకు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ని సంప్రదించాలని తెలిపారు. (Story:ఇంగ్లిష్ గెస్ట్ లెక్చరర్ పోస్టు కొరకు దరఖాస్తుల ఆహ్వానం)

