ఏజెన్సీల విధానం రద్దుచేసి కార్పొరేషన్ వ్యవస్థ తీసుకురావాలి
కనీస వేతన జీవోలకు గెజిట్ చేయాలి
పి.సురేష్ తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర కార్యదర్శి
వనపర్తి ప్రభుత్వ మెడికల్ కళాశాల పారిశుద్ధ్య, సెక్యూరిటీ కార్మికుల సమావేశం
న్యూస్‌తెలుగు/వనపర్తి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కనీస వేతన జీవోలకు గెజిట్ చేయాలని తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ)రాష్ట్ర కార్యదర్శి డిమాండ్ చేశారు. బుధవారం వనపర్తి ప్రభుత్వ మెడికల్ కళాశాల పారిశుద్ధ్య సెక్యూరిటీ సూపర్వైజర్ కార్మికుల ఉమ్మడి సమావేశం వరుణ్ అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా పి.సురేష్ మాట్లాడుతూ:-తెలంగాణ వైద్య విద్య బోధన,జనరల్ ఆసుపత్రుల కింద పనిచేస్తున్న పారిశుద్ధ్య సెక్యూరిటీ పేషెంట్ కేర్ సూపర్వైజర్ కార్మికులకు వేతనాలు అందించే ఏజెన్సీల మూడు సంవత్సరాల కాల పరిమితి ముగుస్తుందని ఆ ఏజెన్సీలను రద్దుచేసి ఐహెచ్ఎఫ్ఎంఎస్ ద్వారా నూతన టెండర్ల ప్రక్రియ ప్రారంభించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు కార్మికుల వేతనాల చెల్లింపులో ప్రభుత్వం తీవ్రమైన అలసత్వం ప్రదర్శిస్తుందని దీని ఫలితంగా కార్మికులు నెలల తరబడి వేతనాలు రాక అగౌరవలు పడు పడుతూ అప్పుల ఊబిలోకి వెళుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.2012 సంవత్సరము నుండి వేతనాలు సవరణ నోచుకోలేదని తెలంగాణ రాష్ట్రం వచ్చిన కూడా కనీస వేతనాల జీవోలు సవరణ చేయలేదని అన్నారు. గత ప్రభుత్వం 2021 సంవత్సరంలో కనీస వేతన జీవోలు 21 నుండి 25 వరకు తెచ్చిన అప్పటి ముఖ్యమంత్రి గజిట్ చేయలేదని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వమైన కాలయాపన చేయకుండా తక్షణమే కనీస వేతన జీవోలకు గెజిట్ చేసి 26 వేలకు కార్మికులకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. లేనిచో ఆందోళనలకు సిద్ధమవుతామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే శ్రమ దోపిడీకి గురి చేసే ఏజెన్సీ విధానానికి స్వస్తి పలికి కార్పొరేషన్ వ్యవస్థను తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో మెడికల్ కళాశాల కార్మికులు వరుణ్, నరేష్,మన్నేమ్మ,సైదాబేగం, లావణ్య, లక్ష్మి,బొజ్జమ్మ, చెన్నమ్మ, శ్రీదేవి,లత,శోభ,పీరమ్మ,జయలక్ష్మి,శారద, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. (Story:ఏజెన్సీల విధానం రద్దుచేసి కార్పొరేషన్ వ్యవస్థ తీసుకురావాలి)