Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌ ఎమ్మెల్యే  మిరియాల శిరీష దేవి భర్త పై అవినీతి ఆరోపణలు చేయడం తగదు

 ఎమ్మెల్యే  మిరియాల శిరీష దేవి భర్త పై అవినీతి ఆరోపణలు చేయడం తగదు

 ఎమ్మెల్యే  మిరియాల శిరీష దేవి భర్త పై అవినీతి ఆరోపణలు చేయడం తగదు

న్యూస్ తెలుగు/ చింతూరు : వైసిపి ధనలక్ష్మి హయాంలో చింతూరు డివిజన్ కేంద్రంగా ఒక ప్రముఖ వైద్యులు డబ్బులు కోసం వేధించడం వల్ల అతను లొంగకపోతే అతను హాస్పిటల్ ను ముగించిన చరిత్ర వైసీపీ ఈ విషయమై ఆ వైద్యుడు స్వయంగా ప్రస్తావిస్తూ 2024న టిడిపి కూటమికి అనుకూలంగా ఎన్నికల ప్రచారం చేయడం జరిగింది.  ఇదే కాకుండా మా ఎమ్మెల్యే గెలిచిన ఒక్క సంవత్సరంలోనే రెండుసార్లు అసెంబ్లీ జరిగితే రెండుసార్లు కూడా జీవో నెంబర్ 3 పోలవరం నిర్వాసితుల సమస్యలపై ప్రస్తావించడం జరిగింది ప్రస్తావించిన ఒకటి రెండు నెలల్లో నిర్వాసితుల ఖాతాలో 813 కోట్ల రూపాయలు జమ చేసిన చరిత్ర కూటమిప్రభుత్వాన్ని గత ఐదు సంవత్సరాలు వైసిపి ప్రభుత్వం గానీ అప్పటి ఎమ్మెల్యే ధనలక్ష్మి గాని ఎమ్మెల్సీ అనంత బాబు గారిని అసెంబ్లీ సాక్షిగా నిర్వాసితుల సమస్యలపై ఏనాడు మాట్లాడలేదు. మా ఎమ్మెల్యే అభివృద్ధి సంక్షేమ పథకాలు అన్ని వర్గాల ప్రజలకు అందాలను ఉద్దేశంతో కుల మతాలకు అతీతంగా లబ్ధిదారులకు ఇవ్వడం జరుగుతుంది. చిన్న ఉదాహరణ వైసిపి యూత్ లీడర్ సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకుంటే వైసీపీ అని చూడకుండా సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చిన చరిత్ర మా ఎమ్మెల్యే గారిది అనేకమంది అభాగ్యులకు ఆదుకోవడంలో మా ఎమ్మెల్యే ముందుంటారు. దీనికి ఉదాహరణకిని తన సొంత ఖర్చులతో అంబులెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది.గత ప్రభుత్వంలో చింతూరు మండలంలో పెద్ద సీతనపల్లి గ్రామంలో కాళ్ల వాపు వ్యాధితో కొంతమంది మరణిస్తే ఆ లబ్ధిదారుల్లో నిజమైన లబ్ధిదారులకు నష్టపరిహారం ఇవ్వకుండా వైసిపి ఆనుభూతిపరులకు నష్టపరిహారం ఇచ్చిన చరిత్ర వైసీపీ ది మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి. నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ వరి రైతులకు దాని డబ్బులు పడట్లేదు అని ప్రస్తావించడం జరిగింది. కూటమి ప్రభుత్వంలో వరి రైతులు వారి ధాన్యాన్ని అమ్మిన 24 గంటల్లో రైతులు ఖాతాలో డబ్బులు జమ చేసిన చరిత్ర మా ప్రభుత్వాని మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగిని వేధించడం జరిగింది అని చెప్పడం జరిగింది. ఈ ఎమ్మెల్యే గతంలో వైసిపి హయంలో చింతూరు డివిజన్ కేంద్రం వద్ద ఒక సచివాలయ ఉద్యోగిని పై యఫ్ ఐ ఆర్: 77/20 21 చేయించి ఆ ఉద్యోగిని వేధించటం వల్ల ఆ సచివాలయ ఉద్యోగికి ఉద్యోగం పర్మినెంట్ కాలేదు. అదే కాకుండా చింతూరు పోలీస్ స్టేషన్ కేంద్రంగా ఎవరైతే బాధితులున్నారో వారిని వైసిపి నాయకులు స్వయంగా పోలీస్ స్టేషన్ లోపల కొట్టిన చరిత్ర వైసిపి నాయకులది అనే అనేక గంజాయి కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నవారు కూడా ప్రజా ప్రతినిధులు ఈ విధంగా అనేక అసాంఘిక కార్యక్రమాలు ప్రోత్సహించి ఆ అసాంఘిక కార్యక్రమాలకు, అసాంఘిక శక్తులకు ముఠా నాయకుడుగా ఎమ్మెల్సీ అనంతబాబు ఎమ్మెల్యే ధనలక్ష్మి వ్యవహరించడం జరిగింది. ఈ విధంగా గత వైసిపి ప్రభుత్వం లో అనేక అక్రమాలకు పాల్పడటమే కాకుండా వైసిపి నాయకులకు కనుసన్నల్లో లబ్ధిదారులకు కాకుండా ఇతరులకు భూములు ముటెషన్ చేయించిన చరిత్ర వైసిపి నాయకులకి ఈ నాయకురాలకు ధనలక్ష్మి ప్రోత్సహించే వారిని కాబట్టి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాసేవ చేస్తున్నటువంటి నాయకురాలు శ్రీమతి మిరియాల శిరీష దేవి పై అవాకు సవాకులు మాట్లాడితే నియోజకవర్గ ప్రజలు సహించరు అని మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి ని హెచ్చరించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో చింతూరు మండల తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు జిల్లా చిన్నారెడ్డి యూత్ అధ్యక్షులు గడ్డం సురేష్ కుమార్ క్లస్టర్ ఇన్చార్జులు పొదిలి రామారావు ఓబులనేని నరసింహారావు నాయకులు ఆకోజు నూక చారి, కట్టాశంకర్ మహిళ నాయకులు కారం సత్య వతి,సోడె రాములమ్మ,యూత్ నాయకుడు సోయం రవికుమార్, సీనియర్ నాయకుడు ప్రసంగి ,ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు. (Story: ఎమ్మెల్యే  మిరియాల శిరీష దేవి భర్త పై అవినీతి ఆరోపణలు చేయడం తగదు)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!