Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ శాంతిరామ్ సూపర్ స్పెషాలిటీ ఆధ్వర్యంలో మెగా కంటి వైద్య శిబిరం

శాంతిరామ్ సూపర్ స్పెషాలిటీ ఆధ్వర్యంలో మెగా కంటి వైద్య శిబిరం

0

శాంతిరామ్ సూపర్ స్పెషాలిటీ ఆధ్వర్యంలో మెగా కంటి వైద్య శిబిరం

న్యూస్ తెలుగు /వినుకొండ : నంద్యాల, శాంతిరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో వినుకొండ విశ్రాంత ఉద్యోగుల సేవా సంఘం సహకారం తో మంగళవారం విశ్రాంత ఉద్యోగుల సేవా సంఘం భవనం నందు ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కంటి శిబిరం నందు 40 మందికి పైగా కంటి పరీక్షలు చేయగా అందులో 24 మందికి కంటి శుక్లములు గుర్తించి వారందరిని ఆపరేషన్ కొరకు గురువారం రోజున వారి వాహనం ద్వారా వారిని తీసుకొని వెళతామని రిటైర్డ్ పెన్షనర్స్ సంఘం అధ్యక్షులు భువనగిరి సుబ్రహ్మణ్యం , జనరల్ సెక్రటరీ కాళ్ళ కృష్ణమూర్తి , తెలియజేశారు. మిగతా వారికీ మందులు పంపిణి మరియు అద్దాలకు సలహా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోశాధికారి రాఘవయ్య, ఉప అధ్యక్షులు ఎం వి శర్మ , సంఘ సభ్యులు చిన్న కోటయ్య, వెంకటస్వామి మరియు శాంతిరామ్ హాస్పిటల్ బృందం కంటి వైద్యులు జి.టి లోకేష్ కుమార్ , ఆప్టోమెట్రిస్ట్ ప్రవీణ్, ఆర్గనైజర్ ఉరుకుందప్ప తదితరులు పాల్గొన్నారు. (Story:శాంతిరామ్ సూపర్ స్పెషాలిటీ ఆధ్వర్యంలో మెగా కంటి వైద్య శిబిరం)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version