Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో జోనల్ లోని ఐదు మండలాల నూతన కార్యవర్గ సభ్యుల ఎన్నిక

ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో జోనల్ లోని ఐదు మండలాల నూతన కార్యవర్గ సభ్యుల ఎన్నిక

0

ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో జోనల్ లోని ఐదు మండలాల నూతన కార్యవర్గ సభ్యుల ఎన్నిక

న్యూస్ తెలుగు / వినుకొండ : స్థానిక ఏపీ ఎన్జీవో హోం లో ఏపీ.టీ.ఎఫ్ వినుకొండ జోనల్ లోని ఐదు మండలాలకు మంగళవారం నూతన కార్యవర్గ ఎన్నిక పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు తమ్మిశెట్టి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్నికల పరిశీలకులుగా పల్నాడు జిల్లా అధ్యక్షులు ఉస్మాన్, ప్రధాన కార్యదర్శి రవికుమార్, గుంటూరు జిల్లా ఉపాధ్యక్షులు మూర్తి, ఉమ్మడి గుంటూరు జిల్లా పూర్వ అధ్యక్షులు వీరపనేని చంద్రమౌళి మరియు ఐదు మండలాల ఏపీటీఎఫ్ కార్యకర్తలు పాల్గొన్నారు. మండలాలకు సంబంధించి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులతో పాటు ఉపాధ్యక్షులు మరియు కార్యదర్శులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. వినుకొండ మండలానికి అధ్యక్షులుగా ఎం.ఎస్.కె మొహమ్మద్, ప్రధాన కార్యదర్శిగా మీసాల గోపి , శావల్యాపురం మండలానికి అధ్యక్షులుగా సిహెచ్ రామకృష్ణ, ప్రధాన కార్యదర్శిగా పారెళ్ళ తిరుమల గురుబాబు , నూజండ్ల మండలానికి అధ్యక్షులుగా బొప్పూడి వీరాస్వామి, ప్రధాన కార్యదర్శిగా లక్కిరెడ్డి రామాంజిరెడ్డి , ఈపూరు మండలానికి అధ్యక్షులుగా వి.శివా నాయక్, ప్రధాన కార్యదర్శిగా పఠాన్ మొహమ్మద్ ఖాన్ , బొల్లాపల్లి మండలానికి అధ్యక్షులుగా ఎస్.కే. మస్తాన్ షరీఫ్, ప్రధాన కార్యదర్శిగా షేఖ్ షైదా ని ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ. 1947 వ సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉపాధ్యాయుల సంక్షేమమే లక్ష్యంగా ఏర్పాటైన మొట్టమొదటి సంఘం ఏపీ.టీఎఫ్ -257 అని తెలిపారు. నాటినుండి ఇప్పటివరకు ఉపాధ్యాయులకు అనేక సౌలభ్యాలను కల్పించడంలో ఏపీ.టీ.ఎఫ్ విశేష కృషి చేస్తుందని అన్నారు. వీరపనేని చంద్రమౌళి మాట్లాడుతూ. నూతనంగా ఏర్పడిన కార్యవర్గాలకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యకర్తలు అందరూ నిబద్ధత మరియు నిజాయితీతో పనిచేసి సంఘ పటిష్టతకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీ.టి.ఎఫ్ జిల్లా మరియు నియోజకవర్గంలోని కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. (Story:ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో జోనల్ లోని ఐదు మండలాల నూతన కార్యవర్గ సభ్యుల ఎన్నిక)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version