Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌వినుకొండ నియోజకవర్గ సిపిఐ ప్రధాన కార్యదర్శిగా బూదాల శ్రీనివాసరావు

వినుకొండ నియోజకవర్గ సిపిఐ ప్రధాన కార్యదర్శిగా బూదాల శ్రీనివాసరావు

వినుకొండ నియోజకవర్గ సిపిఐ ప్రధాన కార్యదర్శిగా బూదాల శ్రీనివాసరావు

సిపిఐ పట్టణ కార్యదర్శిగా ఉలవలపూడి రాము

న్యూస్ తెలుగు / వినుకొండ : స్థానిక గోగినేని ఫంక్షన్ హాల్ లో సిపిఐ పార్టీ వినుకొండ నియోజకవర్గ మహాసభ సోమవారం సాయంత్రం జరిగింది. అలాగే, వినుకొండ పట్టణ మహాసభ కూడా జరిగింది. ఈ మహాసభలో వినుకొండ నియోజకవర్గ సిపిఐ ప్రధాన కార్యదర్శిగా బూదాల శ్రీనివాసరావు ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే వినుకొండ పట్టణ కార్యదర్శిగా ఉలువలపూడి రాము ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే, నియోజకవర్గ కమిటీ ఏడుగురు , ఇద్దరు ఆహ్వానితులు, 45 మంది నియోజకవర్గ కౌన్సిల్ తో నియోజకవర్గ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది.. ఈ సందర్భంగా నియోజకవర్గ కార్యదర్శిగా ఎన్నికైన బూదాల శ్రీనివాసరావు మాట్లాడుతూ. మాపై నమ్మకంతో కౌన్సిల్ కమిటీ సభ్యులు నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం పట్ల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నియోజకవర్గంలో సిపిఐ పార్టీ బలోపేతం కోసం సాయు శక్తుల కృషి చేస్తానని తెలిపారు. (Story:వినుకొండ నియోజకవర్గ సిపిఐ ప్రధాన కార్యదర్శిగా బూదాల శ్రీనివాసరావు)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!