మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీ రావుల
న్యూస్‌తెలుగు/వనపర్తి : పెబ్బేరు పట్టణంలోని 10 వ వార్డు లోని అబ్దుల్ ఖదీర్ మరణించిన వార్త మాజీ మున్సిపల్ కౌన్సిలర్ పద్మ వేణు ద్వారా తెలుసుకొని మాజీ పార్లమెంట్ సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి ఆ కుటుంబానికి 5000 బీఆర్ఎస్ పార్టీ నాయకుల చేతుల మీదుగా ఆర్థిక సాయం అందించారు, భవిష్యత్తులో అబ్దుల్ ఖదీర్ కుటుంబానికి తోడ్పాటు అందిస్తానని రావుల చంద్రశేఖర్ రెడ్డి తమ సందేశాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెబ్బేరు టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు వి దిలీప్ కుమార్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ ఎద్దుల కరుణ శ్రీ సాయినాథ్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మేకల కర్రేస్వామి మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు చిన్న ఎల్లారెడ్డి వేణు గోపి బాబు మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ విశ్వరూపం సొప్పరి బీచ్ పల్లి మన్యం శేఖర్ గౌడ్ సాయిరెడ్డి ఎల్లయ్య బసవరాజు కిషోర్ భారతి తదితరులు పాల్గొన్నారు. (Story:మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీ రావుల)

