Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ అక్రమంగా PDS బియ్యం తరలించు వారిపై విజిలెన్స్ దాడులు

అక్రమంగా PDS బియ్యం తరలించు వారిపై విజిలెన్స్ దాడులు

0

అక్రమంగా PDS బియ్యం తరలించు వారిపై విజిలెన్స్ దాడులు

న్యూస్ తెలుగు/సాలూరు :ప్రాంతీయ నిఘా మరియు అమలు అధికారి బి. ప్రసాదరావు వారి ఆదేశాల మేరకు విజిలెన్స్ మరియు రెవెన్యూ అధికార్లు పార్వతీపురం మన్యం జిల్లా, పాచిపెంట మండలం పి కోనవలస చెక్ పోస్ట్ వద్ద ఆకస్మిక వాహన తనిఖీలు నిర్వహించు చుండగా కొత్తూరు మండలం కడుమ గ్రామం నుండి ఒడిశా రాష్ట్రం (నవరంగాపూర్) కు పిడిఎస్ బియ్యంతో నిండిన AP39-UU-4289 ప్రయాణిస్తున్న లారీ ను తనిఖీ చేయగా వాహనం నందు దాదాపు రూ. 15,83,400/- విలువ గల 34,800 కిలోల బరువున్న 700 బస్తాల PDS బియ్యం ను కడుమ గ్రామం నకు చెందినరైస్ మిల్ ఓనర్ గోవింద రావు అక్రమంగా రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. విచారణలో పైన పేర్కొన్న పిడిఎస్ బియ్యం కొత్తూరు మండలం, కడుమ గ్రామంలోని తెల్ల కార్డు లబ్ధిదారుల నుండి సేకరించి ఒడిశా రాష్ట్రంలోని నవరంగాపూర్ నందు అమ్ముతామని లారీ డ్రైవరు తెలియచేసాడు. అంతట విజిలెన్స్ అధికారులు 700 బస్తాల పిడిఎస్ బియ్యం మరియు లారీ ను స్వాధీనం చేసుకుని సిఎస్‌డిటికి అప్పగించడం జరిగినది మరియు EC చట్టం 1955 లో ని 6(ఎ) & 7(1) సెక్షన్ల కింద గోవింద రావు మరియు మానేపల్లి వెంకటేష్ (వాహన డ్రైవర్) ల పై కేసులు నమోదు చేయమని మరియు అవసరమైన క్రిమినల్ చర్యలు తీసుకోమని సిఎస్‌డిటి గారికి తెలియచేయడం అయింది. పై తనిఖిలలో విజిలెన్స్ అధికారులు ఇన్స్పెక్టర్ సింహాచలం, సబ్ ఇన్స్పెక్టర్ రామా రావు, పోలీస్ కానిస్టేబుళ్లు పురుషోత్తమ, తిరుపతి రావు మరియు రెవెన్యూ శాఖ అధికారి హేమలత, పాచిపెంట CSDT పాల్గొన్నారు. (Story:అక్రమంగా PDS బియ్యం తరలించు వారిపై విజిలెన్స్ దాడులు)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version