చింతూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రపంచ జనాభా దినోత్సవం

న్యూస్ తెలుగు/ చింతూరు : చింతూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఆర్థిక శాస్త్ర విభాగం అధ్వర్యంలో ప్రపంచ జనాభా దినోత్సవం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.రత్న మాణిక్యం ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థినీ , విద్యార్థులను ఉద్ధ్యేశించి మాట్లాడుతూ భారతదేశం సుమారు 146 కోట్ల జనాభాతో ప్రపంచంలో మొదటి స్థానంలో ఉన్నా మానవాభివృద్ధి సూచ్చిలో వెనుకబడి ఉందన్నారు .వైస్ ప్రిన్సిపాల్ యం.శేఖర్ మాట్లాడుతూ వైద్య ఆరోగ్య సదుపాయాలు పెరగడం వల్ల మానవ జీవితకాలం పెరగడంతో జననాల పెరుగుదల రేటు తగ్గినా జనాభా పెరుగుదల ఉందన్నారు.అర్థశాస్త్ర విభాగాధిపతి జి.వెంకటరావు మాట్లాడుతూ 1987 జూలై 11వ తేదీన నాటికి ప్రపంచ జనాభా 5 బిలియన్లకు చేరుడంతో,1989 లో యుఎన్ఓ ప్రపంచ జనాభా దినోత్సవం ప్రతి సంవత్సరం జూలై 11వ తేదీన జరపాలని ప్రకటించింది.ప్రస్తుతం ప్రపంచ జనాభా 8.2 బిలియన్లకు చేరిందనారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్.వై.పద్మ,యస్ .అప్పనమ్మ ,కె.శకుంతల,జి.హరతి,కె.శైలజ,యం.రామ్ మోహన్ రావు , జి.సాయి కుమార్, బి.శ్రీనివాసరావు, విద్యార్థినీ, విద్యార్థులు, అధ్యాపక , అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. (Story:చింతూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రపంచ జనాభా దినోత్సవం)