ప్రముఖ వ్యాపారవేత్త ఫరీద్ సాబ్ కి నివాళులర్పించిన మాజీ మంత్రి
న్యూస్‌తెలుగు/వనపర్తి : పట్టణములో ప్రముఖ వ్యాపారవేత్త ఫరీద్ సాబ్ గారు అనారోగ్యంతో రాత్రి మరణించడం జరిగింది విషయం తెలుసుకున్న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పార్థివదేహానికి నివాళులు అర్పించారు. కష్టించి పనిచేసి వ్యాపారములో అంచలంచెలుగా ఎదిగిన ఫరీద్ సాబ్ మరణించడం విషాదం అని ఫరీద్ సాబ్ మృతి పట్ల తన ప్రగాఢ సంతాపం తెలియజేసి కుటుంబసభ్యులను పరమార్శించారు. నిరంజన్ రెడ్డి వెంట గట్టు యాదవ్ వాకిటి శ్రీధర్,పి.రమేష్ గౌడ్ నందిమల్ల అశోక్,ఉంగ్లం. తిరుమల్,సయ్యద్. జహంగీర్, జోహెబ్ హుస్సేన్,గులాం ఖాదర్ ఖాన్,సయ్యద్.జమీల్,స్టార్.రహీమ్ తదితరులు ఉన్నారు. (Story:ప్రముఖ వ్యాపారవేత్త ఫరీద్ సాబ్ కి నివాళులర్పించిన మాజీ మంత్రి)

