బీఆర్ఎస్ నాయకులు ఇంటింటి ప్రచారం
న్యూస్‌తెలుగు/పెబ్బేరు : రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్ర మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆదేశాల మేరకు పెబ్బేరు పట్టణ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వి దిలీప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో 7,8,వ వార్డులలో లో బిఆర్ఎస్ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు, ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 420 హామీలు అమలుపరచడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతపట్టణం ప్రతి వార్డులలో ఏ ఒక్క అభివృద్ధి జరగలేదని గత బిఆర్ఎస్ ప్రభుత్వం అమలుపరచిన నిధులను వార్డులలో సీసీ రోడ్లు వేయుచున్నారని, ఎన్నికల ముందు ఇందిరమ్మ ఇండ్లు బోగస్అనీ అర్హులకు ఇవ్వకుండా అనర్హులకే కేటాయించారని, వృద్ధులకు 4000 పెన్షన్ వికలాంగులకు 6000 పెన్షన్ నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, దళితులకు దళిత బంధు పథకం, నిరుద్యోగులకు సంవత్సరానికి ₹2 లక్షల ఉద్యోగాలు, ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి పథకానికి 1,50000=00, తులం బంగారం ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చి మాయమైపోయిందని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేని కాంగ్రెస్ ప్రభుత్వ అభ్యర్థులను చిత్తుగా ఓడించాలని, ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు, ఈ కార్యక్రమం లో మాజీ మున్సిపల్ చైర్మన్ ఎద్దుల కరుణ శ్రీ సాయినాథ్,మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మేకల కర్రే స్వామి మాజీ కౌన్సిలర్లు చిన్న ఎల్లారెడ్డి గోపి బాబు రామకృష్ణ వేణు మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ విశ్వరూపం సొప్పరి బీసుపల్లి హరి శంకర్ నాయుడు శేఖర్ గౌడ్ శివ శంకర్ గౌడ్ సాయి రెడ్డి ఎల్లయ్య మన్యం సహదేవుడు సంబు రాము శ్రీనివాస్ రెడ్డి నరేష్ రమేష్ గౌడ్ యాదగిరి గౌడ్ వేణు గోవర్ధన్ రెడ్డి సురేష్ బసవరాజ్ గౌడ్ మాజీ వార్డు సభ్యులు నాగిరెడ్డి రఘు వెంకటేష్ శేఖర్ ఆచారి రమేష్ రామన్ గౌడు ధ్యారంగుల శ్రీను గోవర్ధన్ రెడ్డి సీకే రాము అఖిల్ బీసన్న రమేష్ భారతి సువర్ణ కథలమ్మ మంగమ్మ తదితరులు పాల్గొన్నారు. (Story:బీఆర్ఎస్ నాయకులు ఇంటింటి ప్రచారం)
