Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ వినుకొండలో రౌడీయిజం చేసిన, గంజాయి కనిపించిన, వారి తోలు తీస్తాం

వినుకొండలో రౌడీయిజం చేసిన, గంజాయి కనిపించిన, వారి తోలు తీస్తాం

0

రౌడీయిజం చేసిన..

గంజాయి కనిపించిన  తోలు తీస్తాం

వ్యవస్థల నాశనం, ప్రజల్ని వేధించడం తప్ప జగన్ చేసింది శూన్యం

వినుకొండలో సుపరిపాలన కార్యక్రమంలో పాల్గొన్న చీఫ్ విప్ జీవీ, డీసీసీబీ చైర్మన్ మక్కెన...

న్యూస్ తెలుగు / వినుకొండ : రాష్ట్రంలో జగన్ అయిదేళ్ల పాలనలో వ్యవస్థల్ని నాశనం చేయడం, ప్రజల్ని వేధించడం తప్ప చేసింది శూన్యం అని ప్రభుత్వ చీఫ్‌ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ధ్వజమెత్తారు. అయిదేళ్ల వారి అరాచకాలు, ఏడాదిలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధే తమ సుపరిపాలనకు నిదర్శనంగా చెప్పారాయన. వినుకొండ 9వ వార్డులో సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, డీసీసీబీ ఛైర్మన్ మక్కెన మల్లికార్జునరావు పాల్గొన్నారు. సంక్షేమ పథకాలపై స్థానికులకు అవగాహన కల్పించి కరపత్రాలు అందించారు. ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను వివరించారు. ఈ సందర్భంగా ఛీప్‌విప్ జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ. గత పాలకులు రాజ్యాంగ వ్యవస్థలపై దాడులు చేసి, చిన్న కాంట్రాక్టర్లను వేధించారని విమర్శించారు. ఎన్ఆర్ఈజీఎస్ కింద 2014-19 మధ్య జరిగిన పనులకు రూ.250 కోట్ల బిల్లులను క్లోజ్ చేయడం వారి దుర్మార్గాలకు నిదర్శనం అన్నారు. 3.5 లక్షల మంది చిన్న కాంట్రాక్టర్లపై కక్షగట్టి బిల్లులు నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చాక వారికి న్యాయం చేయడం మొదలుపెట్టామన్న జీవీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ చొరవ, కేంద్రం సహకారంతోనే అది సాధ్యమైందన్నారు. ఇవేగాక వైసీపీ హయాంలో బీసీలు, దళితులు, మైనార్టీలపై దారుణమైన రీతిలో దాడులు జరిగాయని, వైకాపా నేతలు నాడు చూపించిన రప్పారప్పా రాజకీయానికే ప్రజలు వారిని 151 నుంచి 11కి పడగొట్టారని చురకలు వేశారు. జగన్ ఆ విషయం ఇకనైనా గమనిస్తే మేల ని హితవు పలికారు. చేస్తున్న అభివృద్ధి, సంక్షేమానికి ప్రజలు ఇస్తున్న ఆశీస్సులతో ఎన్డీఏ పాలన మరో 30-40 ఏళ్లు కొనసాగుతుందని, స్వర్ణాంధ్ర లక్ష్యంగా తాము ముందుకెళ్తున్నామని స్పష్టం చేశారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు 16,437 ఉపాధ్యాయ పోస్టులకు పరీక్షలు నిర్వహించామని, త్వరలో నియామకాలు పూర్తవుతాయని తెలిపారు. 20 లక్షలమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీని నెరవేర్చేలా మంత్రి లోకేష్ విదేశాల్లో పెట్టుబడులు ఆకర్షించి రూ.9.34 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు సాధించారని, వాటితో 8.5 లక్షల ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు. దాదాపు 65వేల కోట్లతో అభివృద్ధి చేస్తున్న ఒ‌క్క అమరావతిలోనే లక్షకు పైగా ఉద్యోగాలు రానున్నాయని తెలిపారు. తెలుగుదేశం గత ప్రభుత్వంలోనే 72శాతం పూర్తి అయిన పోలవరాన్ని కనీసం 2శాతం కట్టని జగన్ అసలు రైతుల గురించి ఏ మొహం పెట్టుకుని మాట్లాడుతున్నారో కూడా అర్థం కాలేదని చురకలు వేశారు. ప్రాజెక్టులను పాడు బెట్టడమే కాకుండా రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వని వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు అదే రైతుల పేరిట రాజకీయం చేయాలని చూడడం సిగ్గుచేటన్నారు. స్థానికంగా వినుకొండ పట్టణానికి తాగునీటి సమస్య పరిష్కారానికి రూ.210 కోట్లు తెచ్చామని, త్వరలో ఇంటింటికీ కనెక్షన్లు ఇస్తామని హామీ ఇచ్చారు. రామలింగేశ్వరస్వామి ఘాట్‌రోడ్, తారురోడ్డు, గుడి అభివృద్ధితో పాటు వినుకొండను పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దే పనులు చేపడతామని తెలిపారు. సంక్షేమ పథకాలు పార్టీలకు అతీతంగా అందిస్తామని, రాజకీయ వేధింపులు ఉండవని స్పష్టం చేశారు. అలాగే వినుకొండలో ఎటువంటి రౌడీయిజం చేసిన, గంజాయి కనిపించిన, వారి తాట తీస్తామని ఈ సందర్భంగా జీవి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. (Story:వినుకొండలో రౌడీయిజం చేసిన, గంజాయి కనిపించిన, వారి తోలు తీస్తాం)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version